CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రగతి దేశానికి ఆదర్శం:ప్రభుత్వ విప్ రేగా

Share it:


*ప్రభుత్వ కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

*వాడీ వేడిగా సర్వసభ్య సమావేశం

కరకగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం మంగళవారం కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.

సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ....కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,దానికి సంబంధించిన అధికారులు తగు జాగ్రత్తలు పాటించే విధంగా ముందుకు సాగాలని తెలిపారు.వర్షాకాలంలో ప్రజలకు కలుషితమైన నీరు కాకుండా మిషన్ భగీరథ ఏర్పాటు చేసిన స్వచ్ఛమైన నీరు అందించాలని ఏఈ లకు సూచించారు.పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించదాని,పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ అభివృద్ధి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని అయన అన్నారు.గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నిరంతరం సర్పంచులు కృషిచేయాలని అందుకోసం నిధులను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదే లేదన్నారు.

అదే విధంగా గ్రామల్లో వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి రోగులకు,ఇబ్బందులు,సమస్యలు లేకుండా పారిశుద్ధ్య,పరిశుభ్రత, కార్యక్రమాలు నిర్వహించాలని సర్పంచులకు సూచించారు.

మండలంలో రైతులకు రెండు పంటలను పండించే విధంగా చెక్ డ్యాం పనులు కూడా పూర్తి అవడం జరిగింది.రైతులు పంటలను బ్రహ్మండంగా పండించుకోవడానికి చెక్ డ్యాం ఎంతో ఉపయోగపడుతుందని దానిని వినియోగించుకోవాలని తెలిపారు.

వట్టివాగు ప్రాజెక్టు భూమి కోల్పోయిన భూ నిర్వాసితులకు ప్యాకేజీ అందించడం జరిగిందని తెలిపారు.

నా సంకల్పం,నా జీవితం ఆశయం పులుసు బొంత ప్రాజెక్టు త్వరలో టెండర్ పూర్తి కానుంది.ఆ తర్వాత పులుసు బొంత ప్రాజెక్టు కింద భూమి కోల్పోతున్న భూమి నిర్వాసితులకు త్వరలో ప్యాకేజీలు అందజేయడం జరుగుతుందాని అయన అన్నారు.

 ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొమరం కాంతారావు,అభివృద్ధి అధికారి డి శ్రీను,మండల స్పెషల్ ఆఫీసర్ బాబురావు,తహసీల్దార్ శివయ్య,వైద్యాకారి డాక్టర్ పర్షియా నాయక్,వివిధ శాఖల అధికారులు,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: