CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మల్లూరు హేమాచల క్షేత్రం హుండీల లెక్కింపు పూర్తి

Share it:

 ఆరు హుండీల ద్వారా సమకూరిన రూ 3,89,785 లు

మన్యం టీవీ మంగపేట.

ములుగు జిల్లా మంగపేట మండలంలోని అతి ప్రాచీన, పురాతన, చారిత్రక నేపథ్యం కలిగిన మల్లూరు హేమాచల శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం హుండీల లెక్కింపు గురువారం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ హన్మకొండ పరిశీలకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రవణపు సత్యనారాయణ ఆద్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆరు హుండీల లెక్కింపు ద్వారా మొత్తం రూ,3,89,785 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈ.ఓ సత్యనారాయణ తెలిపారు. దేవస్థానం ఆలయ ప్రాంగణంలో అధికారులు, అర్చకులు, సిబ్బంది పాత్రికేయుల సమక్షంలో గర్భగుడి వద్ద ఉన్న రెండు హుండీలు, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న ఒక హుండీ, దైత అమ్మ వారి వద్ద ఉన్న ఒక హుండీ, వేణుగోపాలస్వామి వద్ద ఉన్న ఒక హుండీ, చింతామణి వద్ద ఉన్న ఒకటి మొత్తం నాలుగు చోట్ల ఉన్న ఆరు హుండీల లెక్కింపు పూర్తిస్థాయిలో లెక్కింపు జరుపగా ఈ ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. కాగా మార్చి 04వతేదీ నుంచి జులై14 వతేదీ వరకు నాలుగు నెలల తర్వాత సదరు హుండీల లెక్కింపు జరిపినట్లు ఈఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, నేతాని సీతారాములు, మంగపేట పోలీస్ స్టేషన్ నుండి కానిస్టేబుల్ శ్రీనివాస్, రెవిన్యూ సిబ్బంది ఆర్ఐ కామేష్, ఆలయ సిబ్బంది శేషుకుమార్ అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కమల రాజశేఖర శర్మ, పవన్ కుమార శర్మ, మురళీకృష్ణ మాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

SLIDER

Post A Comment: