CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉప సర్పంచ్ పదవికి రాజీనామా...

Share it:

 




మన్యం టీవీ : జూలూరుపాడు,

జూలై 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని గుండెపుడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కంచర్ల సూర్యప్రకాశరావు (సూరిబాబు) మంగళవారం రాజీనామా చేశారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి గుండెపుడి గ్రామపంచాయతీ రెండవ వార్డు సభ్యులుగా గెలుపొంది ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండున్నర సంవత్సరాల కాలం పాటు గ్రామపంచాయతీ ప్రజలకు తన సహాయ సహకారాలను అందించారు. రాజీనామా లేఖను గ్రామ సర్పంచ్ నరసింహారావు, ఏడవ వార్డు నెంబర్ చిలుకూరి శ్రీను సమక్షంలో ఏం పీ ఓ రామారావు కు అందజేశారు. ఈ రాజీనామాను తను ఇష్టపూర్తిగా చేస్తున్నట్లు తెలియజేశారు.

Share it:

Post A Comment: