CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమస్యల పరిష్కారం తో ప్రగతి సాధించవచ్చు

Share it:

 


*అధికారులు స్థానిక సమస్యలను గుర్తించాలి.

*ఏటూరు నాగారం గ్రామ పంచాయతీకి పదిలక్షల నిధులు

*మొక్కల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి.

మన్యం టీవీ ఏటూరు నాగారం

పల్లె ప్రగతి లో భాగంగా ఏటూరు నాగారం ఐటిడిఏ సమావేశపు హలులో జరిగిన పల్లె ప్రగతి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలో మలేరియా,డెంగీ విషజ్వరాలు వంటి వ్యాధులు తగ్గుముఖం పట్టాయని మంత్రి స్పష్టం చేశారు.పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో ఉన్న సమస్యలను తొలగించుకోవచ్చునని అలాగే  అధికారులు స్థానిక  సమస్యలను గుర్తించి ఈ పల్లె ప్రగతి లో వాటిని పరిష్కారం దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఆమె పల్లె ప్రగతి కార్యక్రమం పై అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో విసర్జించారు మండలంలోని గ్రామ పంచాయతీల వారీగా గుర్తించిన సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక సర్పంచ్ రామూర్తి, జడ్పి కోఆప్షన్ సభ్యురాలు వలీ యాబీ, వార్డు సభ్యులు సుజాత,రంజిత్ సమస్యలను ఏకరువు పెట్టారు. ఆత్మ చైర్మన్ దుర్గం రమణ మాట్లాడుతూ. ఏటూరు నాగారం లో వర్షాకాలం బురద ఎండాకాలం దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రణాళిక లేకుండా సైడు కాలువలు నిర్మించడంతో నిరుపయోగంగా మారుతున్నాయి అని అన్నారు. జడ్పీ చైర్మన్ కుసమ జగదీష్ మాట్లాడుతూ ఏటూరు నాగారం లో సైడ్ కాలువల సమస్యలు తలెత్తకుండా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏటూరు నాగా రానికి పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి అనుమతిని ఇవ్వాలని అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి తో చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణ లో గ్రామ యూత్ కమిటీలను ప్రజలను భాగస్వాములు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ, వార్డు సభ్యులు వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందుగానే తాడ్వాయి మండలం మేడారం లో సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. మరో ఎనిమిది మాసాల లో వచ్చే మేడారం మహా జాతర నాటికి కరోనా మహమ్మారి అంతం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అమ్మవార్లను దర్శించుకున్నాని అన్నారు. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పి సంగ్రా సింగ్ జి పాటిల్ జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ ఐటిడిఎ పిఓ హనుమంతు కె జెండాగే, స్థానిక సర్పంచ్ బాబురావు మేడారం వనదేవతల పూజారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: