CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రామప్ప కు యునెస్కో గుర్తింపు రావడం పై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ఆనాటి కాంగ్రెస్ హయం లో కాకతీయ శిల్ప కళను ప్రపంచానికి తెలియ పర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది అని అదే విధంగా  తెలంగాణ ఉద్యమ సమయంలో రామప్ప రుద్రేశ్వర ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం కోసం అహర్నిశలు కృషి చేసిన పాండు రంగా రావు,పాపా రావు శ్రీనివాస చార్యులకు ఏళ్ల నిరీక్షణకు యునెస్కో శుభ ముగింపు పలికింది అని యునెస్కో గుర్తింపు కోసం కృషి చేసిన భారత ప్రభుత్వానికి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన 21 దేశాల ప్రతినిధుల కు సహకరించిన  ములుగు జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క  మాట్లాడుతూ సర్వాంగసుందరంగా ముస్తాబైన రామప్ప అంతర్జాతీయ పర్యాటక ముఖచిత్రంలో స్థానం పొందింది అని  వరల్డ్ హెరిటేజ్ కమిటీ (యునెస్కో ) భేటీ అయ్యి రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి 

శిల్పకళాఖండాలకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు... చైనా, ప్యారిస్​లు వేదికగా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ప్రతినిధులంతా... రామప్ప ను  ప్రపంచ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశంగా భావించడం సంతోషకరం అని21 దేశాలు రామప్ప  ఆలయానికి వారసత్వ గుర్తింపు లభించింది. 2020, 21 సంవత్సరాలకు గాను.. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు... యూనెస్కో పరిశీలనకు ఎంపికవగా... మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.రోజుల తరబడి చూసినా తనివితీరని దృశ్యకావ్యం..ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలం పేట  గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ... కొలువైన రామప్ప ఆలయం శిల్పకళా సంపదకు కేంద్రం. కాకతీయ చక్రవర్తి  రేచర్ల రుద్రుడు హయంలో 1213లో నిర్మితమై.. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యంతో అద్భుతంగా,అపురూపంగా చరిత్రలో నిలిచిపోయింది. మహోత్కృష్టమైన శిల్ప ఖండాలు ఈ ఆలయంలో కోకొల్లలు.గంటలు కాదు... రోజుల తరబడి చూసినా తనివితీరని అపురూప ఆకృతులకు ఈ ఆలయం పెట్టింది పేరు. ఆలయన్ని అనుకుని ఉన్న రామప్ప చెరువు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. బోటింగ్ సదుపాయం కూడా ఉండటంతో.. పర్యాటకులకు ఈ ప్రాంతం స్వర్గ ధామమే. శతాబ్దాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆలయ విశిష్టత గురించి ఎంత సేపు చెప్పుకున్నా తనివి తీరదు. అలాంటి ఈ అద్భుత ఆలయానికి నేడు అపురూప గుర్తింపు లభించింది అని సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

Share it:

Post A Comment: