CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బెంగాలీ నాటు-లాభాల బాట

Share it:

 



భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం పశ్చిమ బెంగాల్.


బెంగాలీ విధానాన్ని అనుసరిస్తున్న తెలంగాణ రైతులు


స్థానిక కూలీలు అనుసరించి పాటించాలని కోరిక


నాటు విధానాన్ని పరిశీలించిన పినపాక మండల వ్యవసాయ అధికారులు


మన్యం మనుగడ, పినపాక:


భారతదేశంలో వరిని ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. కారణం వారు అనుసరించే నూతన విధానాలు అని, మణుగూరు వ్యవసాయ సహా సంచాలకులు తాతా రావు అన్నారు.   బెంగాలీ నాటు అనే పదం మన రాష్ట్రం లో కొత్త పదం కావొచ్చు కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,పినపాక మండలం లో రైతులు ఈ బెంగాలీ నాటు పద్ధతి ద్వారానే రైతులు వరి పంటని నాటే విధానం ప్రారంభించారు.


పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు వరి నాటు వేయడం లో ప్రత్యేక స్థానాన్ని సాధించారు. వీరు నాటు వేయడానికి మన స్థానిక రైతులు నాటు వేయడానికి, చాలా తేడా ఉంటుంది.  మన స్థానిక రైతులు నాటు వేయాలంటే వారి రవాణా ఖర్చుతో పాటు ఎకరానికి 5000/- రూపాయల ఖర్చు ఔతుంది ,అయినప్పటికీ మన స్థానిక రైతులు ఒక పద్దతి లో వరి రకం , వయస్సును  బట్టి చదరపు మీటరు కి   శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన ప్రకారం, మన స్థానిక రైతులు  నాటు వేయడం లేదు. నాటు వేసిన తరువాత కాలిబాటలు తీయడానికి అదనంగా 300/- రూపాయలు తీసుకుంటారు. మన స్థానిక రైతులు నాటు వేసేటపడు 90 డిగ్రీలు అంటే నిటారుగా కుదుల్లని వేరుతో సహా నేరుగా నేల లో నాటడం లేదు. 


కానీ ఈ బెంగాలీ నాటు పద్ధతిలో ముగ్గురు కూలీలు ఒక ఎకరం నాటు వేయడానికి 3500/- మాత్రమే తీసుకుంటూ నాటువేసే సమయంలో పొలం దగ్గరే  తాత్కాలిక గుడారాలు వేసుకుంటూ, అక్కడే ఉంటారు తద్వారా రవాణా ఖర్చు తగ్గుతుంది.

అదే మన స్థానిక రైతులు 10 మంది నాటుతున్నారు 

ఈ బెంగాలీ కూలీలు అయితే ఒక కూలి ఒకే సారి 6 వరుసలు అంటే ముగ్గురు కూలీలు 18 వరుసలు ఒకేసారి నాటుతారు.  సాలు సాలుకి, మొక్క మొక్కకి కచ్చితమైన దూరాన్ని పాటిస్తారు. స్థానిక రైతులు  నాటిన పొలం లో 30 క్వింటాల్ దిగుబడి వస్తే,  బెంగాలీ కూలీలు నాటిన పొలం లో 32 క్వింటాల్ దిగుబడి వస్తుందిఅని,  10వేల రూపాయల పెట్టుబడి తగ్గడం వల్ల ,మొత్తం 14-15 వేల నికర ఆదాయం రైతుకి వస్తుంది.  ఈ పద్దతి లో నాటు వేసిన తరువాత, కాలి బాటలు తీయవలసిన అవసరం లేదు. తద్వారా గాలి , వెలుతురు సక్రమంగా ప్రసరించడం  వల్ల చీడ పీడలు తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉండడం వల్ల ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుండి మన రాష్ట్రానికి మన రైతులు  వానాకాలం మరియు యసంగి పంట సమయాల్లో ఇక్కడికి తీసుకుని వస్తున్నారు. బెంగాలీ కూలీ లు కూడా వారికి మంచి పని , ఎక్కువ డబ్బులు వస్తుండడంతో  సుదూర ప్రాంతం నుండి ఇక్కడికి సంతోషంగా వస్తున్నారు. ఇప్పటికైనా మన స్థానిక కూలీలు,  బెంగాలీ కూలీల వలే వరి నాట్లు వేయడం నేర్చకున్నట్లైతే ముందు ముందు మన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది అని ఏ డి ఏ తాతారావు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో పినపాక మండల వ్యవసాయధికారి ఈ . వెంకటేశ్వర్లు , వ్యవసాయ విస్తరణ అధికారులు కొమరం లక్ష్మణ్ రావు,  కేశవ రావు స్థానిక రైతులు ఎల్లంకి నర్సింహారావు , పచ్చి పులుసు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: