CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దయచేసి దాతలు స్పందించగలరు

Share it:

 


-లివర్ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరుపేద వ్యక్తికి బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ చిరు సాయం



  మాన్యం టివి దుమ్ముగూడెం:

మండలంలోని పాత మారేడుబాక గ్రామంలో గల గుండివారి గుంపులోని అతి నిరుపేద కుటుంబానికి చెందిన గుండి బసవయ్య(55) గత కొంతకాలం నుండి కిడ్నీ మరియు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.మెరుగైన వైద్యానికి డబ్బులు లేవు,కనీసం మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు అన్నయ్యా.....అంటూ వారి కొడుకు ప్రసాద్ స్థానికంగా గల బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ నిర్వాహకులకు వారి బాధను చెప్పడం జరిగింది.వెంటనే స్పందించిన నిర్వాహకులు వారి బిఎల్ఏ సభ్యులందరి తరపున శనివారం నాడు వారి కుటుంబానికి 3000/-రూ సహాయాన్ని అందజేయడం జరిగింది.బిఎల్ ఏ సభ్యుడు పూనెం నాగరాజు మాట్లాడుతూ...ఆపదలో ఉన్న ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావలసిందిగా కోరారు.సాటి మనిషికి సహాయం పడటంలో పొందే ఆనందం మరి ఎందులో కూడా పొందలేము అని ఈ సందర్భంగా వారు అన్నారు.మానవత్వంతో ఇంకా ఎవరైన సహాయం చేయాల్సిన దాతలు ఉంటే వారి ఫోన్ నెంబర్ 70937 77921 మాట్లాడి మీ వంతు సహాయం చేయగలరు అని దాతలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఎల్ఏ సభ్యులు రాజారావు,చిట్టిబాబు,దుర్గారావు,ధర్మయ్య,చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: