CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విశ్వకర్మ లను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు

Share it:


👉జీఎస్టీ కట్టిన కలప కొనుగోలు చేసిన అధికారుల వేధింపులు

👉 ఫర్నిచర్ విక్రయానికి సంతకాలు పెట్టని ఫారెస్ట్ అధికారులు

👉జిల్లా అధ్యక్షులు కాపర్తి వెంకటాచారి

మన్యం మనుగడ, మణుగూరు:

    విశ్వకర్మ జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ కోటర్ మణుగూరు టౌన్ పరిధిలో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఇందులో లో విశ్వకర్మ పై ప్రభుత్వం అధికారులు శీతకన్ను వెయ్యడాన్ని చాలా బాధాకరమని జిల్లా నాయకులు, విశ్వకర్మ లు ఆవేదన వెళ్లబుచ్చారు. ప్రభుత్వం అధికారులు సూచించిన విధంగా  బిల్లు కర్ర తెచ్చుకొని జీవనం సాగించు కుంటున్నాము. కానీ ఇప్పుడు అధికారులు ఆ బిల్లులపై సంతకాలు పెట్టమని చేసిన వస్తువు బయటకు పంపించడానికి వీలు లేదని చెప్పడంతో విశ్వకర్మల బతుకు ప్రశ్నార్థకంగా మారిందని 

   జిల్లా అధ్యక్షులు కాపర్తి వెంకటాచారి అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు మా ఆవేదన గుర్తించి మేము సక్రమంగా GST 18% కట్టి తెచ్చినా బిల్లులను కలపను పరిశీలించి మేము చేసిన వస్తూవులు కస్టమర్లకు అందించే వీలు కల్పించాలని కోరారు. ఇలా బిల్లులపై సంతకాలు చేయకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే   ఆత్మహత్య శరణం అన్నారు. మా సమస్యలు పరిష్కరించాలని లేకపోతే జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి పోరాటాలకు సిద్ధమని అన్నారు.

      ఈ కార్యక్రమంలో జుజ్జురి  ప్రభాకర చారి సింహాద్రి వీరభద్రా చారి,  ధనంజయ చారి..,కడియాల సాయిబాబా,    గుంట ముక్కల గంగా చారి,  తాటికొండ బ్రహ్మచారి,  రమణాచారి,  శ్రీనివాసచారి,

    TV999 వెంకటాచారి మణుగూరు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: