CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవాళి మనుగడకు మొక్క దిక్కు

Share it:

 



 *జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి


 *నాసిరెడ్డి వినయ్ స్మారకంగా భార్గవ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో రెండు వందల మొక్కలతో హరితహారం

మన్యం టీవీ మంగపేట.


 మానవాళి మనుగడకుమొక్కదిక్కుఅనిమొక్కలు నాటి చెట్లను పెంచాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి పిలుపునిచ్చారు. సోమ వారం మండలంలోని అకినేపల్లి మల్లారం లో ఇటీవల నిర్మించిన నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి - చిట్టెమ్మ స్మారక వైకుంఠధామం ప్రాంగణంలో హరితహారం సందర్భంగా శ్రీ భార్గవ ఆటోమొబైల్స్ హీరో షోరూం మణుగూరు వారి ఆధ్వర్యంలో రెండువందల మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాంబశివ రెడ్డి మాట్లాడుతూ గోదావరి నది చెంత ప్రకృతి ఒడిలో మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం అడవుల నరికివేత ఎక్కువ కావడం చేత చెట్ల సాంద్రత తగ్గిపోయి ప్రాణవాయువు ఆక్సీజన్ ఉత్పత్తి ఆశించినంత జరగటం లేదనీ విచారం వ్యక్తం చేశారు. మొక్కలను ఆరోగ్యవంతంగా ఏపుగా పెంచడానికి అవసరమైన ఎరువులను తమ వికాస్ అగ్రి ఫౌండేషన్ ద్వారా అకినేపల్లి మల్లారం మరియు టీ.కొత్తగూడెం జంట గ్రామ పంచాయతీలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సాంబశివ రెడ్డి ప్రకటించారు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిరోజు జయంతి వర్ధంతి మరియు ఇతర ముఖ్య సందర్భాలలో తప్పనిసరిగా మొక్కలు నాటి పెంచాలని విజ్ఞప్తి చేశారు. హీరో షోరూం యజమాని నాశిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని సాకారం చేసే దిశగా హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ జన్మహక్కు గా భావించి మొక్కలు విరివిగా నాటాలని కోరారు. నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి పేరిటనిర్మించిన స్వర్గధామం లో నాటిన ప్రతి మొక్కనీ సంరక్షించేందుకు నీటి సదుపాయంతోపాటు ట్రీగార్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భార్గవ ఆటోమొబైల్స్ హీరో షోరూం ప్రతినిధులు నాశిరెడ్డి వెంకటరమణ భార్గవ్ రెడ్డి గంగుల నరేందర్ రెడ్డి నాయకులు నాశిరెడ్డి నారాయణరెడ్డి నాగిరెడ్డి కటుకూరి శేషయ్య వికాస్ అగ్రి పౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి చెట్టుపల్లి తిరుపతిరావు వికాస్ రెడ్డి వివేకానంధ రెడ్డి సమ్మిరెడ్డి, మాధవ రెడ్డి కృష్ణారెడ్డి మరియు పానెం నారాయణ గంపల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: