CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి..

Share it:

 


👉38 సర్వే నెంబర్ భూమిని స్వాధీనం చేసుకోవాలి..

👉బోజ్యా తండా పోడు భూమికి పట్టాలు ఇవ్వాలి కాసాని డిమాండ్...



మన్యం టీవీ : జూలూరుపాడు, జూలై 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని నల్లబండ బోడు గ్రామంలో 38 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు గత ఏడాది పట్టాలు చేయించుకున్నారని, అట్టి పట్టాలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య మాట్లాడుతూ.. మండలంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని అన్నారు. నల్లబండ బోడు గ్రామంలో 38 సర్వే నెంబర్ గల భూమి పాస్ పుస్తకాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తక్షణమే రద్దు చేయాలని అన్నారు.అట్టి భూమిపై ప్రభుత్వము నిరుద్యోగులకు ఉపయోగపడేలా పరిశ్రమ ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. గతంలో సిపిఎం పార్టీ కలెక్టర్ కు మరియు స్థానిక ఎమ్మార్వో కు ఫిర్యాదు చేసిందని గుర్తుచేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా అధికారులు తక్షణమే వాటిని రద్దు చేస్తామని మాట ఇచ్చారని, అయినప్పటికీ ఇంతవరకు  ఆ పట్టాలు రద్దు కాలేదని, ధరణి పోర్టల్ లో ఇంకా ఆ పట్టాలు చూపిస్తున్నాయని అన్నారు. తక్షణమే ఆ పట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్లబండ బోడు గ్రామంలో పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

బోజ్యా తండా లో సాగు చేసుకుంటున్న పోడు భూములు జోలికి ఫారెస్ట్ అధికారులు వస్తే భారీ ఎత్తున ఉద్యమం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. బోజ్యా తండా గ్రామ ప్రజలకు సిపిఎం పార్టీ అండదండగా ఉంటుందని ఆయన అన్నారు. పోడు భూములు తక్షణమే పట్టాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల  కార్యదర్శి చీమలపాటి బిక్షం, బానోత్ ధర్మ, గార్లపాటి వెంకటి, బానోతు ఇస్రా, పేరుమల్ల వెంకటేశ్వర్లు, వేణు, బానోత్ మధు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: