CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రమాదపు అంచున వాహనదారుల ప్రాణాలు..

Share it:

 


ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు....


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :


మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయి. అక్రమ సంపాదన ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. వీరివల్ల గ్రామస్తులు, వాహనదారులు ప్రాణాలు  అరచేతిలో పెట్టుకొని ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న వారి ప్రాణాలు గాలిలో కలుస్తాయి. వివరాల్లోకి వెళితే.. చండ్రుగొండ మండల పరిధిలోని గానుగపాడు గ్రామ శివారు కాకర్ల వెళ్లే ఆర్అండ్బి రహదారి పక్కనే కొంతమంది మట్టి మాఫియాగా ఏర్పడి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యదేచ్ఛగా మట్టి తొవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఆర్అండ్బీ రహదారికి ఆనుకొని సుమారు 100 మీటర్లు పొడవు  30 అడుగుల లోతులో భారీ కందకాన్ని తొవ్వారు దీంతో అక్కడ అది పెద్ద క్వారిని తల్పిస్తుంది. అసలే అది సింగిల్ రోడ్ దానికి తోడు  అక్కడే పెద్ద మూలమలుపు ఉండటంతో అటు ప్రయాణికులతో పాటు గ్రామస్తులు, రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దాని పక్కనే ఉన్న వ్యవసాయ భూమి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు తెలియకుండా ఇంత పెద్ద కందకం ఎవరు తీసారు అని ఆందోళనకు గురవుతున్నారు. ఈ కందకం వల్ల భారీ వర్షాలు కురిస్తే మా భూమి పూర్తిగా కుంగిపోయి కొట్టుకుపోయే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల ఇప్పుడు మా పొలానికి వెళ్ళే దారి కూడా లేదని. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసి ఇది నిండితే మా పరిస్థితి ఏంటి. అందులో మా పశువులు మా పొలానికి ఈ మార్గం ద్వారా వెళుతుంటాయి అవి తెలియక అందులో పడితే  దానికి బాధ్యత ఎవరు వహిస్తారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి కందకాలు తవ్విన వారిపై  చర్యలు తీసుకొని ఆ కందకాన్ని పూర్తిగా మూసి వేయాలని కోరుతున్నారు.

ఇదే విషయంపై డిప్యూటీ తహసిల్దార్ ఎల్ ప్రసన్న కుమారి ని వివరణ కోరగా తమ దృష్టికి ఇప్పటి దాకా రాలేదని వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి దానిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు,   ఇసుక రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Share it:

Post A Comment: