CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా వైద్య అధికారి దిష్టిబొమ్మ దగ్ధం, సిపిఎం చర్ల

Share it:



మన్యం టీవీ చర్ల:

చర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య అధికారుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

 ఈ సందర్భంగా సిపిఎం పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా జిల్లా వైద్య అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని, ప్రజల పట్ల కనీస బాధ్యత లేని వైద్య అధికారుల వైఖరి నశించాలి అని అన్నారు. ఈ నిర్లక్ష్య వైఖరిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి చర్ల కేంద్రంలో లేనందువల్ల గతంలో అనేక మంది చనిపోయారని, నిన్నటికి నిన్న గుంపెన గూడెం గ్రామానికి చెందిన నిండు గర్భిణీ స్త్రీ యాక్సిడెంట్ అయ్యి సమయానికి ప్రభుత్వ ఆసుపత్రి చర్ల కేంద్రంలో లేనందువల్ల వైద్య అంధనoదువల్ల మరణించిందని, సమయానికి ఇక్కడ వైద్యం అందించి ఉంటే ఆమె ప్రాణాలకు ఏ ప్రమాదం ఉండేది కాదని అన్నారు. ఇంకా ఎన్ని ప్రాణాలు బలి తీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇంకా ఎంత మంది ప్రాణాలు పోతే ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ నెలకొల్పుతారని అన్నారు. ప్రాణాపాయ పరిస్థితి లో ఉన్న పేషంట్లను తీసుకెళ్లేందుకు ఉపయోగపడే 108 అంబులెన్స్ ని గత 20 రోజులుగా బాగు చేయకుండా షెడ్ లోనే ఉంచారని అన్నారు. ఇన్ని రోజులు గా అంబులెన్స్ ను బాగా చేయకుండా ఏమి వెళ్లగాబేడుతున్నారని , ఇదేనా ప్రజల పట్ల వైద్య అధికారుల కి ఉన్న బాధ్యత అని అన్నారు. వైద్యం అందక ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఈ అధికారులకి కళ్ళు కనబడటం లేదు అని ధ్వజ మెత్తారు. ఈ 13 పంచాయతీల్లో వైద్యం సరైన సమయానికి అందకుండా మరణించే ప్రతి ఒక్కరికి ఈ అధికారులు కారణమని అన్నారు. ఒకపక్క ప్రాణాంతక కరోనా మరోపక్క వర్షాకాలం వస్తుందని సీజనల్ వ్యాధులు వస్తాయని ప్రజలకి వైద్యాన్ని చేరువ చేయాలనే కనీస ఆలోచన అధికారులకు లేకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారని అన్నారు. 

ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వీడి కళ్లు తెరవాలని లేదంటే ఇంకా ఎన్నో ప్రాణాలను బలి చేసిన వాళ్ళు అవుతారని, అన్నారు. అందుకని తక్షణం చర్ల మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వాసుపత్రిని నిర్వహించి ఆ తరహా వైద్య ప్రజలకి అందించాలని, 20 రోజులుగా ప్రిపేర్ లో ఉన్న 108 అంబులెన్స్ ని వెంటనే బాగు చేయాలని, ప్రశాంతి ఆసుపత్రి కి సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని, పోస్టుమార్టం నిర్వహణ చర్ల మండల కేంద్రం గానే నిర్వహించాలని డిమాండ్ చేశాడు లేనియెడల సిపిఎం పార్టీ కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటామని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు శ్యామల వెంకట్, మచ్చ రామారావు వరదల వరలక్ష్మి ఊడుగుల షారోని పాముల సాంబశివరావు కర్రీ నరసింహమూర్తి అయినవోలు శ్రీను జగ్గం రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: