CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చెరువుని తలపిస్తున్న అశ్వారావుపేట వాగొడ్డుగూడెం ఆర్ & బి రోడ్డు...

Share it:



*కొత్తగా నిర్మించిన కల్వర్టు తో ఇబ్బంది పడుతున్న మండల ప్రజలు...


*పట్టించుకోని అధికార యంత్రాంగం..


*ఆదేశాలు ఇచ్చినపుడు హడావుడి...అటు పిమ్మట చేతులు ఎత్తివేత..


 *ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న...* *-ఎంపీటీసీ వేముల భారతి


 మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణం మేజర్ పంచాయితీ పరిధిలో గల మొదటి సెగ్మెంట్ లో కొత్తగా నిర్మించిన కల్వర్టుల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారని కాంగ్రెస్ ఎంపీటీసీ వేముల భారతి అన్నారు. ఆదివారం సెగ్మెంట్ పర్యవేక్షణ లో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకున్న అనంతరం ఈ కల్వర్టుల వల్ల ప్రజలకు వరిగేది ఏమి లేదని, వున్న నాలుకకు మండుగువేస్తే కొండనాలుక ఊడినట్లు ప్రజలు వాపోతున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం ఏటా పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలనే మహోన్నతమైన లక్ష్యంతో రూ.కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిత్యం పనులు చేపడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేఽశ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగిస్తోంది. కానీ అశ్వారావుపేటలో అధికార యంత్రాంగానికి ఇవేమీ పట్టనట్లు ఉంటున్నాయి. ప్రభుత్వం కార్యక్రమాలను జరపమని ఆదేశాలు ఇచ్చినపుడు హడావుడిగా చేసి చేతులు దులుపుకుంటున్నారు అని అన్నారు. రోడ్డు కంటే హైట్ నిర్మించిన కల్వర్టులను కావర్చేసేందుకు ఆర్ & బి రోడ్డుపై ఎటువంటి పర్మిషన్ లేకుండా భారీ లెవల్ కాంక్రీటు పోయడం వల్ల వాగొడ్డుగూడెం అనంతరం వాహన దారులకు తిప్పలు తప్పడం లేదని ఆ వర్షపు నీటి వల్ల పక్కవున్న ఇళ్ళు సైతం మునుగుతున్నాయని, ఏటా గ్రామపంచాయతీ ద్వారా రూ.కోట్లను వివిధ రూపాల్లో ఖర్చు చేస్తున్నా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు అని ఆమె పేర్కొన్నారు తక్షణమే ఫై అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను ప్రరిష్కరించాలని స్థానికులు కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: