CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు లో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజా వేదిక..

Share it:

 


👉అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదు..

👉అడిషనల్ పి డి సుబ్రహ్మణ్యం..


మన్యం టీవీ : జూలూరుపాడు, జూలై 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ 14 వ విడత ప్రజావేదిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఉపాది పనులలో అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని డిఆర్ డివో అడిషనల్ పి డి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. మండలంలోని ఇరవైనాలుగు పంచాయతీలలో ది 01-03-2019నుండి 30-05-2021 సం వరకు, మండల వ్యాప్తంగా 3 వేల, 2 వందల, 81 పనులకు గాను ఎక్స్పెండిచర్ వేజ్ కు 7 కోట్ల, 60 లక్షల, 37 వేల, 969 రూపాయలను, మెటీరియల్ కు 1 కోటి, 84 లక్షల 97 వేల, 240 రూపాయలు కాగా మొత్తం, 9 కోట్ల, 45 లక్షల, 35 వేల, 209 రూపాయల, నిధులతో చేపట్టిన ఉపాధి పనుల వివరాలు,కూలీల వేతనాల చెల్లింపులను,మెటీరియల్ ఖర్చుల వివరాలను,హరిత హారంలో నాటిన మొక్కలు ప్రస్తుతం బతికి ఉన్న మొక్కల వివరాలను సామూహిక తనిఖీ బృందం సభ్యులు అధికారులకు మరియు ప్రజలకు తెలియజేశారు.అదేవిధంగా కొన్ని పంచాయితీలలో ఉపాధి పనులకు సంబంధించిన రిజిస్టర్లు, మస్టర్ ఫామ్స్,జాబ్ కార్డుల అప్డేషన్ సక్రమంగా లేదని తెలిపారు. కూలీలకు వేతనాలు చెల్లించి మస్టర్ లలో సిబ్బంది కొట్టి వేసినట్లు సామూహిక తనిఖీలలో బయటపడింది. దీనితో అడిషనల్ పి డి కొన్ని పంచాయతీలలో సిబ్బందికి రికవరీ కై ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పనుల్లో ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అక్రమాలకు, అవకతవకలకు, తావు లేకుండా ఉపాధి పనులను చేపట్టాలని అన్నారు. అక్రమాలను వెలికి తీసేందుకు సామూహిక తనిఖి ఉపయోగపడుతుందని, ఈ తనిఖీ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళ వచ్చు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి రమణ, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి అనూష, ఎంపీపీ లావుడ్యా సోనీ, ఎంపీడీవో చంద్రశేఖర్, ఈజీఎస్ ఏపీవో జమీర్ పాషా, S R P ఝాన్సీ , తో పాటు సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: