CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అకాల వర్షాల కారణంగా ముంపునకు గురైన గుండ్ల వాగు పరివాహక ప్రాంతాల పంట పొలాలను పరిశీలించిన ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని మొద్దులగూడెం గ్రామంలో మంగళవారం సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ముంపునకు గురి అయిన పంట పొలాలను పరిశీలించిన జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క అకాల భారీ వర్షాలకు గుండ్ల వాగు ఉప్పొంగి వాగు పరివాహక ప్రాంతంలో సుమారు వెయ్యి ఎకరాల వరి పొలాలు వరదలతో ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే నష్టపోయిన రైతులకు పంట నష్టం కల్పించి రైతన్నను తెరాస ప్రభుత్వంఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే తెరాస ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా పంట భూములు  ముంపునకు గురి అయి తీవ్రంగా నష్టపోతున్న రైతులకు పంట నష్టం కల్పించి, ఆదుకోవాలని సూచించారు.  ఎకరాకు సుమారుగా 15000 వరకు పెట్టుబడి పెట్టి వరి నాట్లు వేసిన రైతులు అకాల వర్షాలకు సుమారు 1000 ఎకరాల వరకు వరదకు మొక్కలు కొట్టుకుపోయి, ఇసుక మేటలు పెట్టి మళ్ళీ నాట్లు వేయడానికి వీలు లేకుండా ఉందని అన్నారు.  సమస్త మానవాళికి అన్నం పెట్టే రైతన్న అడుగడుగునా నష్టపోతూనే ఉన్నాడని, రైతే రాజు అని చెప్పే తెరాస ప్రభుత్వం వెంటనే మేల్కొని సుమారు కోటి రూపాయలతో గుండ్ల వాగుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేసి, గండ్లను పూడ్చాలని అలాగే  సంబంధిత అధికారులు మేల్కొని ప్రభుత్వానికి పంట నష్టం ఎంత మేరకు జరిగిందో నివేదిక పంపి తగిన పంట నష్టం ఇప్పించగలరని కోరుకుంటున్నా అని అన్నారు. అందరి ఆకలి తీర్చే రైతన్న ఆవేదనను అర్థం చేసుకుని రైతన్నకు అండగా, ఆసరాగా నిలబడాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నానని అన్నారు. అలాగే ఈ మధ్య హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్బంగా దళిత బంధు పేరిట మళ్ళీ ప్రజలను మోసం చేసి ఓట్లను గెలుచుకోవడానికి మోసపూరిత వాగ్దానాలు కేసీఆర్ గారు చేస్తున్నాడని, దళితుల ఓట్లు హుజురాబాదులో సుమారు నలభై వేళకు పైగా ఉండడంతో లక్ష కోట్లతో ప్రతి ఇంటికి పది లక్షలు ఇస్తానని దొంగ వాగ్దానాలు చేస్తున్నాడని అన్నారు. అలాగే దళితుల ఇప్పటికిప్పుడు వరాల జల్లు కురిపించే కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటికి అయిన కేసీఆర్ గారు మోసపూరిత వాగ్దానాలు మానుకుని రైతులను ఆదుకోవాలని అన్నారు.రైతులకు ఇస్తానని చెప్పిన ఏక కాలంలో పంట రుణమాఫీ ఏమయినదని, పంట కొనుగోలు సమయంలో ఆరుగాలం పంట పండించే రైతన్నలను దోచుకుంటున్న మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట ఎందుకు వేయలేదని ధ్వజమెత్తారు.తెరాస ప్రభుత్వ నిరంకుశ పాలనకు తొందరలోనే ప్రజలు బుద్ది చెపుతారని అన్నారు.ముందు రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు నష్టపోయిన రైతులకు తక్షనమే పంట నష్టం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,జిల్లా ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవి చందర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతరాంనాయక్,మండల యూత్ నాయకులు చింత క్రాంతి,ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు,గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, పస్రా గ్రామ సర్పంచ్ ముద్దబోయిన రాము,పస్రా గ్రామ అధ్యక్షుడు మరియు ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, మండల సీనియర్ నాయకులు కణతల నాగేందర్ రావు, పాలడుగు వెంకటకృష్ణ,కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,జెట్టి సోమయ్య, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్,పెండెం శ్రీకాంత్,పంగ శ్రీను బర్ల సమ్మిరెడ్డి,కొర్ర శ్రీను,చెరుకుల సురేష్,మందడి ఉత్తరయ్య, వాసం శ్రావణ్,భూక్య సుక్య, విజయ,ఆగబోయిన కల్యాణి,వాసం పాపయ్య,వాసం సాంబయ్య, సనప రమేష్,మాడ నాగేశ్వరరావు,బర్ల కిరణ్, తండ రవి,పగడాల మల్లారెడ్డి, గాజుల కిరణ్,అరుజుల వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: