CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

90 లక్షల గంజాయిని పట్టుకున్న చుంచుపల్లి ఎస్ ఐ బి.మహేష్

Share it:


మన్యం టీవీ, కొత్తగూడెం జూలై 6 :- సోమవారం నాడు సాయంత్రం సుమారు 4:00 గంటల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చుంచుపల్ల ఎస్ ఐ బి.మహేష్ మరియు తన సిబ్బంది. కలిసి బృందావనం దగ్గర వాహనాలను తనిఖీ చేయుచుండగా TS 15 UC 8255 అను నెంబరు గల బొలెరో వాహనం అనుమానాస్పదంగా ఖమ్మం వైపు పోవుచుండగా,దానిని పోలీస్ వారు ఆపి క్షున్నంగా తనిఖీ చేయగా, ట్రక్కు వెనుక భాగములో కట్ చేసిన ప్లైవుడ్ షీట్ మధ్య భాగములో పైకి కనపడకుండా దాచిన 11 తెల్లని ప్లాస్టిక్ బ్యాగులలో 4.5 కింటాల నిషేదిత గంజాయి ఉండగా గమనించి పోలీస్ వారు వాహన డ్రైవరును మరియు దానిలో ఉన్న మరొక వ్యక్తిని పట్టుకొని విచారించగా వీరు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర ఔరంగాబాద్ కు చెందిన SK షబ్బీర్ S/O బషీర్ అహమ్మద్, వయస్సు 32 సంవత్సరములు, బొలెరో వాహన డ్రైవర్ TS 15 UC 8255 R/o ప్లాట్ నెంబర్ 4-12-57, సంజయ్ నగర్, ఔరంగాబాద్ జిల్లా, మహారాష్ట్ర, మరియు మీర్జా బేగ్ S/O సర్దార్ మీర్జా బేగ్, వయస్సు 56 సంవత్సరములు, కూలీ R/O కాంతినగర్ నిజామాబాద్ జిల్లా అనువారు బొలెరో వాహనంలో 4.5 కింటాల నిషేదిత 90,00,000 గంజాయిని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడినారు.

వీరిద్దరూ మహారాష్ట్రకు చెందిన గంజాయి వ్యాపారస్థులైన జావేద్, రసూల్ చెప్పిన ప్రకారం వీరికి తెలిసిన ఇద్దరు వ్యక్తులు సంగారెడ్డికి చెందిన ధరమ్ సింగ్, రవి అనే వారు మొత్తం నలుగురు. కలిసి ధరమ్ సింగ్, రవి ఏర్పాటు చేసిన బొలెరో వాహనంలో అనగా తేదీ.నిన్న 05.07.2021 తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీలేరు సరిహద్దుకు వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద సుమారు 4.5 కింటాల నిషేదిత గంజాయి Rs.90, లక్షల విలువచేసే గంజాయిని కొనుగోలు చేసి అనంతరం బొలెరో వాహనంలో భద్రాచలం వచ్చి అక్కడ ధరంసింగ్, రవిలు దిగిపోయి, SK షబ్బీర్ మరియు షంషు మీర్జా బేగ్ ఇద్దరు కలిసి బొలెరో వాహనంలో నిషేదిత గంజాయిని మహారాష్ట్ర ఔరంగాబాద్ కు అక్రమంగా తరలిస్తుండగా పోలీస్ వారు వీరిద్దరిని గంజాయి మరియు వాహనంతో పాటు పట్టుకోవడం జరిగినది.అనంతరం పట్టుబడిన వీరి ఇరువురిపై కేసు నమోదు చేసి ఇ రిమాండ్ నిమిత్తం కోర్టు నకు తరలించడం జరుగుతుంది.

ఇపత్రికా సమావేశంలో పాల్గొన్న అధికారులు డిఎస్పీ కొత్తగూడెం జి. వెంకటేశ్వర బాటు, సర్కిల్ ఇన్స్పెక్టర్ చుంచుపల్లి డి.గురుస్వామి, చుంచుపల్లి ఎస్సై బి.మహిష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: