CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

48 గంటల్లో హుజురాబాద్ లో దళిత బందు అమలు తేదీలు ప్రకటించాలి

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

దళిత సంఘాల, మేధావులతో కూడిన షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి కమిటీ ముఖ్య నాయకుల సమావేశంం ములుగు జిల్లా లో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివకుమార్ హాజరై మాట్లాడుతూ కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.ఈ డిమాండ్ పై ముఖ్యమంత్రి గారు 48 గంటల్లో స్పందించాలని అన్నారు.దళిత బందు పథకాన్ని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఈ పథకం అమలు చెయ్యాల్సిందే..ప్రతి కుటుంబానికి 10లక్షల అందించాల్సిందే. అన్నారు.

48 గంటల్లో హుజురాబాద్ లో దళిత బందు పేరుతో ఇచ్చే పథకానికి సంబంధించిన తేదీలను ప్రకటి౦చాలి.

హుజురాబాద్‌లో ఉన్న 20,900 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నోటిఫికేషన్‌లోపు అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు అమలు చేయాలి. హుజురాబాద్‌లో 100 శాత౦ అమలు చేసి, రాష్ట్ర వ్యాప్త౦గా 100 రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో అమలు పూర్తి చేయాలి.

ఈ నగదును ప్రతి కుటుంబానికి  నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.ఈ పథకం ద్వారా ఇచ్చే లబ్ధిదారులకు ఎట్టిపరిస్థితుల్లో ఆంక్షలు లేకుండా ప్రతి కుటుంబానికి ఇవ్వాలి.ముఖ్య మంత్రి మొదట నియోజకవర్గానికి 100 మందికి అంటూ 1200 కోట్లని, రెండో సారి 2వేల కోట్లు అన్నారు.,మూడో సారి లక్ష కోట్లు అన్నారు.ఆయన మొదట ఆ కన్య్ఫూజన్‌ నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో పూర్తిగా దళిత బందు అమలుకు 2లక్షల 38 వేల కోట్లు అవుతాయని గుర్తి౦చి స్పష్టమైన ప్రకటన చేయాలి.  

ప్రతి నియోజకవర్గానికి దళిత బందు పథకానికి 2వేల కోట్లు కేటాయించాలి.పంజాగుట్టలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టి౦చాలి.బ్యాక్ లాక్ పోస్టులపై స్పష్టత ఇవ్వాలి.ఎన్నికల కంటే ముందే మంత్రివర్గంలో దళిత ప్రాతినిధ్యం కల్పించాలి.ఇద్దరు కొత్త మంత్రులకు అవకాశం ఇచ్చి కొప్పుల ఈశ్వర్‌ గారికి ఉప ముఖ్య మంత్రి పదవి ఇవ్వాలి. దళిత బందు కొనసాగిస్తూనే దళితులకు మూడెకరాల భూ పంపిణీ కొనసాగి౦చాలి.దీని కోసం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 25వేల కోట్లు కేటాయించాలి.దళితుల నుంచి ప్రజా, ప్రభుత్వ అవసరాల కోసం అన్సైడ్ మెంట్  భూములు రైతు వేదికలు,పల్లే ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు,కలెక్టర్ భవనాలు మరియు ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూమికి సమానంగా మరో చోట భూమిని కేటాయించాలి.

దళితుపై జరుగుతున్న దాడుల ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి సరైన చర్యలు తీసుకొనే ఈ విధంగా నిర్ణయం తీసుకోవాలి.

ముఖ్యమంత్రి కార్యాలయంలో దళిత ఐఏఎస్‌ అధికారులు, సలహా మండలిలో దళిత మేధావులు,విద్యా వంతులు ఎంతమంది ఉన్నారో చెప్పాలి.లేని పక్షంలో తక్షణం ముఖ్య మంత్రి కార్యాలయంలో దళిత ఐఏఎస్ అధికారులను నియమించాలి.తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ లో వీసీల సంఖ్య పెంచాలి.అలాగే టిఎస్ పిఎస్ సి దళిత అధికారులను నియమించాలి.రాష్ట్రంలో నియమించే ప్రతి నియమకాల్లో దళిత వాటా ప్రకారం 18% అమలు చేస్తూ కేటాయింపులు జరగాలి.ఆత్మగౌరవ భవనాల పేరుతో ఆధిపత్య కులాలకు హై టెక్‌ సిటీ ప్రాంతంలో 5 ఎకరాలు కేటాయిస్తే, అక్కడే దళితుల్లోని 60 కులాలకు ఒక్కొ కులానికి 5 ఎకరాలు కేటాయించాలి. వారికి ఒక ఎకరం కేటాయిస్తే దళితుల్లోని 60 కులాలకు 60 ఎకరాలు కేటాయించాల. దీనిపై స్పష్టత ఇవ్వాలి.హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలి.అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో మరియు నియోజకవర్గాలతో పాటు ప్రతి మండలంలోని  అంబేద్కర్ భవనాలకు స్థలం కేటాయించి భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చెయాలి.

ఈ డిమాండ్ పై 48 గంటలలో ముఖ్యమంత్రి  సానుకూలంగా స్పందించాలి.వీటి అమలు ఈ విషయంలో కార్యరూపం దాల్చె ఈ విధంగా చర్యలు తీసుకోనే ప్రకటన చేయాలి.ఈ 48 గంటల్లో ముఖ్యమంత్రి స్పందించాలి లేకపోతే ఆమరణ దీక్షకు కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడం అవసరమైతే హుజురాబాద్ అష్ట దిగ్బంధం చేస్తాం.20 లక్షల మందితో దండోరా వేయడానికి సిద్ధం.48 గంటల్లో అంటే 28 వ తేదీ సాయంత్రం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాల నాయకులు మేథావులతో మరోసారి సమావేశం కావడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి ఈ డిమాండ్ పై స్పందించని పక్షంలో ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం అని అన్నారు.

Share it:

Post A Comment: