CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు),తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మరణ సభలను గ్రామ గ్రామాన జరుపండి! ప్రజల విముక్తికై నూతన ప్రజాస్వామిక విప్లవంలో నేల రాలిన అమర వీరుల త్యాగాలను ఎలుగెత్తి చాటండి!!


ప్రియమైన ప్రజలారా!


జూలై 28 ఒక ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన దినం అనేది మనందరికి తెలిసిన విషయమే రివిజనిజాన్ని బద్దలు కొడుతూ నగ్జల్బరీ సాయుధ రైతాంగ పోరాటాన్ని సృష్టించి దేశం నలుమూలల వ్యాపింప చేసి నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో మన పార్టీని సంస్థాపించిన సారధులు కా॥ చారుమజుందర్, కా|| కన్హయ్ చటర్జీల అమరత్వాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది ఈ దినాన్ని జరుపుకుంటున్నాం. ఆనాటి నుండి నేటి వరకు భారత నూతన ప్రజాస్వామిక విప్లవ విజయం కోసం అనేక శత్రువు అణచివేత క్యాంపెయిన్లను ప్రతిఘటించి ప్రజా యుద్ధాన్ని పురోగమింపజేస్తూ కేంద్ర కమిటీ నుండి విప్లవ ప్రజల వరకు వేలాది మంది తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన వీర వనితలు, వీరయోధులందరికి తెలంగాణ రాష్ట్ర కమిటీ తలవంచి విప్లవ జోహార్లు అర్పిస్తుంది.


ఈ ఏడాది దేశవ్యాప్తంగా మన పార్టీ, పీఎల్ జీఏతో పాటు ప్రజా సంఘాల వరకు మొత్తంగా 160 మంది ప్రజావీరులు అమరులయ్యారు. తెలంగాణ విప్లవోద్యమాన్ని పునర్ నిర్మిస్తూ కేంద్ర కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కా|| యాపనారాయణ ( హరిభూషణ్) సీనియర్ నేతలు కా॥ కత్తి మోహన్ రావు (ప్రకాషన్న) కా|| సిద్ధబోయిన సారక్క ఈ తరం యువ సైనికుడు కా॥ మాదరి బిక్షపతి ఇంకా ఏరియా కమిటీ సభ్యులు కా॥ సుధీర్, కా|| శంకర్, కా॥ శ్రీను, కా||జోగాల్, కా|| లలిత, కా|| రాజే, కా|| లక్మాల్, కా|| సుక్కాల్, కా|| బాజీరావు, కా|| ఐతులు అశేష పీడిత ప్రజల విముక్తి కోసం తమ నులి వెచ్చని రక్తాన్ని ధార పోశారు. ఈ వీరుల మరణం తెలంగాణ విప్లవోదమానికి, ప్రజలకు తీరని నష్టాన్ని కలిగించింది.


తెలంగాణ మావోయిస్టు పార్టీ సెట్ బ్యాక్ కు గురైన అనంతరం మళ్లీ భూస్వాములు పల్లెల్లో విజృంభిస్తూ రైతుల భూములను బలవంతంగా కబ్జా చేస్తున్నారు. భూస్వామ్యం, రాజకీయ వ్యవస్థ, పోలీసు, రెవెన్యూ, కాంట్రాక్టర్స్, గుండాలు, ఇసుక మాఫీయా, అవినీతి పరులు అందరు కుమ్మక్కై నూతన భూస్వామ్య వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఈ వ్యవస్థపై ఆధారపడి, భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ప్రజల శ్రమను, ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు.


టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహరం పేరుతో, అభయారణ్యాల పేరుతో, టైగర్ జోన్స్ పేరుతో ఆదివాసీలను, సొంత భూముల నుండి అడవుల నుండి వెళ్ళగొట్టి సామ్రాజ్యవాదులకు అక్రమంగా కట్టబెడుతున్నారు. గ్రానైడ్ క్యారీలు, ఓపెన్ కాస్టులు, భారీ నీటి ప్రాజెక్టులు, ఫార్మా కం పెనీల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రజల పట్టా భూముల నుండి తరిమివేస్తూ భూస్వాముల, పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల లాభాలకోసం పాటు పడుతున్నది. ఈ దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు న్యాయమైన డిమాండ్లతో ప్రజాస్వామికంగా పోరాడుతుంటే ఆ పోరాటాలను క్రూరంగా అణచివేస్తున్నారు. ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టుపై దోపిడీ పాలక వర్గాలు ఎన్నడూ లేనంతగా బహుముఖ దాడిని కొనసాగిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికార పాలక పార్టీలు సమాధాన్ పేరుతో విప్లవోద్యమాన్ని అంతమోదించడానికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించి ఆధునిక ఆయుధాలు, డ్రోన్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేస్తూ మరింత క్రూరంగా, పాశవికంగా అణచివేయడానికి సాయుధ బలగాలను పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు.


తెలంగాణ ప్రజలు నీళ్ళు, నిధులు, నియమకాలు, ఎన్‌కౌంటర్లు లేని ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నారు. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులనే కాదు జీవించే హక్కును కూడా హరించివేస్తుంది. తమ మౌళిక సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న రైతాంగంపై, విద్యార్థులపై, కార్మికులపై, ఉద్యోగులపై, హక్కుల నేతలపై రచయితల పై, కాళకారులపై, ప్రజాస్వామిక వాదులపై, ప్రజా సంఘాలపై అణచివేతతో విరుచుక పడుతుంది.


ప్రజలను అన్ని రకాలుగా పీల్చి పిప్పి చేస్తున్న ఈ దోపిడీ వ్యవస్థను కూల్చి ప్రజా విముక్తి సాధించడానికి నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో ప్రియతమ కామ్రేడ్స్ అమరులయ్యారు. వారు చూపిన దారిలోనే మనమంతా ప్రయాణిద్దాం. అమరుల కల‌లను నిజం చేద్దాం.


ప్రజలారా!

అమర వీరుల గొప్ప త్యాగాలను, వారు చేసిన కృషిని యువతరానికి చాటి చెప్పండి.


గ్రామాల్లో కరుడు కట్టిన భూస్వామ్యాన్ని తరిమికొట్టిన పోరాట చరితలను నేటి తరానికి తెలియజేయండి.


పేదరికంలో మగ్గుతున్న అమరుల కుటుంబాలకు మీకు తోచిన సహాయాన్ని అందించండి


జూలై 28 నుండి వారం రోజుల వరకు నగరాల్లో, పట్టణాల్లో, గల్లీల్లో, పల్లెల్లో, మీ ఇంటిలో రెండు నిమిషాలు అమరులను స్మరించుకొండి


భూస్వాముల, పెత్తందార్ల, భూ కబ్జాదారుల, అవినీతిపరుల పీడ‌న నుండి అశేష ప్రజల విముక్తి కోసం పోరాడుతన్న సీపీఐ (మావోయిస్టు)ను కంటికి రెప్పలా కాపాడుకొండి.


పార్టీ కొనసాగిస్తున్న ప్రజాయుద్ధంలో మీరంతా భాగస్వామ్యంకండి.


విప్లవాభివందనాలతో


జగన్,

అధికార ప్రతినిధి,

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు),

తెలంగాణ రాష్ట్ర కమిటీ

Share it:

Post A Comment: