CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అబ్బుగూడెం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మంజూరు

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, అబ్బుగూడెం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణంకు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు అయినందుకు, జిల్లా కలెక్టర్-అనుదీప్ దురిశెట్టి (ఐఏఎస్). మండల ప్రజలకు,గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ నెల 1వ తేదీన అన్నపురెడ్డిపల్లి మండలం, అబ్బుగూడెం గ్రామ పంచాయతిలో పల్లె ప్రగతి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి, గ్రామ సభ నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ-సందీప్ కుమార్ సుల్తానీయా(ఐఏఎస్).గ్రామంలో జరుగుతున్న అబివృద్ది పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసి, నూతన భవనం మంజూరు చేయడం జరుగుతుందని.జిల్లాలో ప్రప్రధమంగా అబ్బుగూడెం పంచాయతికి భవనం మంజూరు కావడం. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది ఆశయానికి గ్రామ ప్రజలు సహకారానికి లభించిన గౌరవమని, ఇదే స్ఫూర్తి అన్ని గ్రామ పంచాయతీల్లో రావాలని,ఆయన స్పష్టం చేశారు. 

 15 రోజుల్లో భూమిని గుర్తించి, ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించాలని. డీపీఓ కు సూచించారు. భవన నిర్మాణానికి రూపకల్పన పీఆర్ చీఫ్ ఇంజనీర్ తయారు చేసిన ప్రణాళికలు చేపట్టాలని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: