CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పై నిరసన

Share it:

 


(సిఐటియు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)

మన్యం మనుగడ, అన్నపురెడ్డిపల్లి: సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సిఐటియు)ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో మరియు ఎర్రగుంట గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు-కొండపల్లి శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పాలన దేశ ప్రజల,కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని, ఆదాని, అంబానీల సేవలో మునిగిన మోడీ, ప్రజలను కరోనా వారి నుండి కాపాడుకోవటానికి ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం లో పూర్తిగా విఫలమైందని, ఆర్థిక వనరులన్నీ తన గుప్పెట్లో పెట్టుకొని కేంద్రం పేదలను, పనులు కోల్పోయిన వారిని, ఆకలి మంటల నుండి కాపాడే బాధ్యత వదిలేసిందని అన్నారు. అదే సమయంలో కేంద్రం ముఖేష్ అంబానీ తన సంపాదనను గంటకు ₹75 కోట్ల పెంచేందుకు అవకాశం ఇచ్చిందని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై మన నిరసన గొంతు వినిపించాలని అన్నారు. వివిధ రూపాల్లో మన నిరసనలను పాలకులకు తెలియజేయాలని అన్నారు. చైనా  వియత్నాం క్యూబా వంటి సోషలిస్టు దేశాలు, కరోనాను అరికట్టడంలో మరణాలు అతికొద్ది సంఖ్యకు పరిమితం చేయడంలో విజయం సాధించిందని తెలిపారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం నేరపూరిత అసమర్థ పాలనకు ఎండి కట్టెల కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం.కేంద్రం పట్ల లొంగుబాటు వైఖరి వైఖరి అవలంభిస్తోందని అన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ లోడ్  పొడిగింపులు తప్ప ఉపాధి పోయే ఆదాయాలు దెబ్బతిన్న కార్మిక కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.  కరొన కష్టాలను అనుభవిస్తున్న ప్రజలకు  ప్రతి కుటుంబానికి నెలకు 7,500 రూపాయలు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం ఇవ్వాలని,పెట్రోల్ రేట్లను సామాన్యులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.  కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ను  తక్షణమే రద్దు చేయాలని అన్నారు. మల్టీపర్పస్ వర్కర్లకు కనీస వేతనం 19000 ఇవ్వాలని అన్నారు. కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు, ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి అందిస్తున్న సేవలను గుర్తించి వారికి కనీస వేతనం ఇవ్వాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో మండల వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు- శనగల శ్రీను, సైదులు. ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు-విజయ, లక్ష్మి,  నాగమణి, బేబీ, నాగేశ్వరి, సీత.GPవర్కర్స్ యూనియన్ నాయకులు-కృష్ణారావు, వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: