రైతుల ప్రయోజనాత్థమే రైతు వేదికలు
రైతు వేదికలను,వైకుంఠ ద్వామలను ,స్థానిక ప్రజ ప్రతినిధుల కలిసి ప్రారంబించిన ప్రభుత్వ విప్ రేగా
మన్యం టీవీ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు, డంపింగ్ యార్డు, వైకుంఠ ద్వామలను ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు స్థానిక ఎంపీపీ, జడ్పిటిసి,సర్పంచ్ లతో కలిసి ప్రారంభించారు. మండలరిదిలోని అనంతారం,సమత్ బట్టుపల్లి గ్రామాలలో రైతుల ప్రయోజనార్దంగా నిర్మించిన రైతు వేదికలను ప్రారంబించారు అలాగే పద్మపూరం, బట్టుపల్లి, సమత్ బట్టుపల్లి కన్నాయిగూడెం గ్రామపంచాయతి లలో నిర్మించిన వైకుంఠ ద్వామలు,డంపింగ్ యార్డు లను ప్రారంబించారు.అనంతరం రైతు బట్టుపల్లి డంపింగ్ యార్డు లో వర్మి కంపోర్టు ఎరువు తయారు చేసే విధాని ఎంపిఓ సునిల్ అడిగుతెలుసుకున్నారు.అలాగే కల్వలనాగరంలో డంపిగ్ యార్డు నందు తయారు చెసిన వర్మీ కంపోర్టు ఎరువుల ప్యాకెట్ ని స్థానిక సర్పంచ్ భూక్య భాగ్య లక్ష్మి ,సెక్రటరీ తరుణ్ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కి అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ప్రయోజనార్దం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని పూర్తి చేసిందని ,రైతుల అందరు వారి వారి పంట పొలాల్లో వేసుకునే పంటల వివరాల గురించి ఈ ప్రదేశంలో చర్చించుకొని పంట ఫలితాలను పొందే అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో పంటలకు సంభవించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ సంబంధిత అధికారాలతో,రాష్ట్ర పాలక వర్గంతో కూడ మాట్లడి పంటలు వేసెవిదానాన్ని గురించి తెలుసుకొవచ్చునని అయన తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతి సర్పంచులు ఎటువంటి నిర్లక్ష్యం వహించ కుండా గ్రామలను అభివృద్ధి పధంలో నడిపించె విధంగా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి కొమరం కాంతారావు ఎంపీపీ రేగా కాళికా వ్యవసాయ శాఖ ఏడి తాతారావు, ఏవొ అనిల్ ఏఈవొ ప్రశాంత్ ,పినపాక పిఎసియస్ చైర్మన్ ముదునురి రవి శేఖర్ వర్మ,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు పినపాక నియోజకవర్గ అత్మకమిటి చైర్మన్ పోనుగోటి భద్రయ్య మండల రైతు బందు సమితి డైరెక్టర్ వట్టం వెంకటేశ్వర్లు డిఈ సైదులు రెడ్డి, ఎంపిడిఓ శ్రీనివాస్, తహసీల్దారు శివయ్య అనంతారం సర్పంచ్ బత్తిని నర్సిహరావు, గొల్లగూడెం సర్పంచ్ ఇర్ప విజయ్ కుమార్, కొత్తగూడెం సర్పంచ్ గొగ్గలి నాగమణి, చొప్పాల సర్పంచ్ జవ్వాజి రాద,పద్మపూరం సర్పంచ్ తాటి సరోజినీ బర్లగూడెం సర్పంచ్ పోలెబోయిన నర్సిహరావు తాటిగూడెం సర్పంచ్ కొమరం విశ్వనాథం, కరకగూడెం సర్పంచ్ ఊకె రామనాథం చిరుమల్ల సర్పంచ్ పాయం నర్సిహరావు సమత్ బట్టుపల్లి సర్పంచ్ పోలెబోయిన శ్రావణి బట్టుపల్లి సర్పంచ్ తొలెం నాగేశ్వరరావు కన్నాగూడెం సర్పంచ్ భూక్య భాగ్య లక్ష్మి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: