CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బంగారు తెలంగాణ షర్మిళమ్మ తోనే సాధ్యం : నాడేం శాంతి కుమార్.

Share it:

 


మన్యం మనుగడ,భద్రాద్రి కొత్తగూడెం :

            ఆదివారం  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక డా.బి.ఆర్ అంబెడ్కర్ గారి కమిటీ హాల్లో నందు, భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక రెడ్డి సత్రంలో, పినపాక నియోజకవర్గానికి సంబంధించి మణుగూరు లోని మౌనిక హోటల్ లో షర్మిల పార్టీ ఆవిర్భావ సన్నాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వైయస్ షర్మిల పంపించిన ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ పరిశీలకులు నాడేం శాంతి కుమార్ గారి అధ్యక్షతన సన్నాహక కమిటీకి ఎంపికయిన సభ్యులను ప్రకటించి వారితో పార్టీ ఆవిర్భావ తేదీ వరకు చేయవలసిన కార్యక్రమాలను దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిశీలకులు నాడేం శాంతి కుమార్ గారు మాట్లాడుతూ...

జులై 8న షర్మిలమ్మ పార్టీ ఏర్పాటు చేసేలోపు అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకోవాలి. తెలంగాణ ఏర్పాటు కోసం ఆత్మ బలిదానాలు చేశారు.ఇప్పుడు ఉద్యోగాల కోసం చనిపోతున్నారు. నిన్నమల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుడు తూటుకూరి మల్లారెడ్డి(75 ) అనే వ్యక్తి ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తే, ఇల్లు కట్టించి ఇవ్వవలని పోరాడి పోరాడి   కూల్చిన ఇంటి ప్రాంగణంలోనే చితి పేర్చుకొని ఆత్మాహుతి చేసుకున్న ఘోరమైన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ జరిగివుండదు. అలాంటి స్థితిలో తెలంగాణను చూస్తున్నాం. ఇలాంటి తెలంగాణ కోరుకుంది..? ఇదేనా తెలంగాణ అంటే?  మేము ఒక్కటే చేప్తున్నాం బంగారు తెలంగాణ సాకారం చేయటానికే, సరికొత్త రాజకీయాలకు నాంది కాబోతుంది షర్మిలమ్మ పెట్టబోయే పార్టీ. తెలంగాణ ప్రజల అందరి అభివృద్ధి, సంక్షేమం కోసం.. అందరి భాగస్వామ్యంలో పార్టీ అవలంభించే విధానాలు .. సిద్ధాంతాలు, ప్రజలు ఎలా ఉండాలని ఆశిస్తున్నారో వారి ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ పార్టీ  విధానాలు , రూపకల్పన .. సిద్ధాంతాలు ఉండాబోతున్నాయి కనుక షర్మిలమ్మ సూచన మేరకు సమన్వయ కమిటీలో ఉన్న వాళ్ళందరూ ప్రజల్లోకి వెళ్లి,  ప్రతి గడపకు వెళ్లి వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు, వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి !? వాళ్లకు ఇంకా అందనిది ఏంటి !?మనం అందించాలసింది ఏంటి !? మీరు తెలుసుకోవాలి. ప్రతి వర్గ్గాని అడిగి తెలుసుకోవాలి. బడుగు బలహీన వర్గలా ఏమి కోరుకుంటున్నారు!? విద్యార్థులు ఆకాంక్షలు ఏంటి!? నిరుద్యోగుల ఆశలు ఏంటి !? మహిళల ఇబ్బందులు ఏంటి !? రైతుల అవసరాలు ఏంటి !? కష్టకుని కష్టాలు ఏంటి !? వృద్ధుల బాధలు ఏంటి !? గిరిజనుల సమస్యలు ఏంటి !? ఉద్యోగస్తుల కష్టసుఖాలు ఏంటి!? అన్ని తెలుసుకోవాలి. ప్రతి ఇంటిని, ప్రతి కుల సంఘన్ని , పతి ప్రజా సంఘాన్ని, ప్రతి మేధావిని కదిలించాలి, వాళ్ళ అభిప్రాయాలను సేకరించామని తెలియచేసారు. ఈ రోజు కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండబోతుంది. " ఇప్పుడు పెట్టబోయే పార్టీ ప్రజల పార్టీ కనుక దీని ఎజెండాను నేను రాయకూడదు తెలంగాణ ప్రజలు రాయాలి." అనే షర్మిలమ్మ ఆలోచనను ప్రతి ఒక్కరు గౌరవించాలసిందే. ఆమెను చూస్తుంటే ముందు చూపుఉన్న నాయకురాలులని, తెలంగాణను తండ్రివలె సంక్షేమ పాలన అందిస్తుందనే నమ్మకంతో ప్రతి తెలంగాణ బిడ్డ ఈ అజెండాను చూసి ఒప్పుకునేదిగా, మెచ్చుకునేదిగా ఉండాలని మనమందరం భాగస్వాములం కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు నాడేం శాంతి కుమార్. ఈ కార్యక్రమంలో మరో పరిశీలకులు భూపాలపల్లి జిల్లా నాయకులు అప్పం కిషన్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులు కొల్లు వెంకట్ రెడ్డి, లక్కినేని సుదీర్ బాబు,తుంపాల కృష్ణ మోహన్, శీలం వెంకట్ రెడ్డి, గడిపల్లి కవిత, శీలం చెన్నరెడ్డి గార్లతో పాటు సన్నాహక కమిటీ సభ్యులు,నియోజకవర్గల నాయకులు మరియు మండల,గ్రామా స్థాయి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: