మండల రైతులకు సూచనలు చేసిన ఏఈ రవీందర్
మన్యం మనుగడ, పినపాక:
వర్షాకాలం సమీపించినందున పినపాక మండలం లోని రైతు సోదరులందరు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఏడూళ్ల బయ్యారం విద్యుత్ శాఖ ఏ ఈ రవీందర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వర్షాకాలంలో పిడుగుల శబ్దాలకు ఇన్సులేటర్లు పగిలి, లైన్లు తెగి కింద పడే అవకాశం ఉందని, రైతు సోదరులు పొలాలకు వెళ్లేటప్పుడు రాత్రి సమయంలో తప్పనిసరిగా టార్చ్ లైట్ లు తీసుకొని వెళ్ళాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అయితే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని తెలియజేశారు. ఒకవేళ ఎవరికైనా తెగిపడిన తీగలు కనబడినట్లు అయితే సొంత మరమ్మతులు చేయవద్దని, అలాగే విద్యుత్ సరఫరా లేనట్లయితే ఫీజులు సొంతంగా వేసుకోకూడదని , విద్యుత్ శాఖ ఉప కేంద్రానికి ఫోను చేసి తెలియజేయాలని, వెంటనే సిబ్బంది వచ్చి సరి చేస్తారని తెలియజేశారు. ఈ సలహాలను రైతు సోదరులు అందరూ తప్పనిసరిగా పాటించి క్షేమంగా ఉండాలని కోరారు.
Post A Comment: