బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్
మన్యం టీవీ పాల్వంచ: బహుజన్ సమాజ్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులుగా జయమ్మ కాలనీ కి చెందిన కోళ్ళపూడి.ప్రవీణ్ కుమార్ మండల అధ్యక్షులుగా జగన్నాధపురం కు చెందిన తౌడోజ్.వెంకట చారి లను నియమిస్తూ మంగళవారం బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ నియమకపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ప్రవీణ్,చారి లు మాట్లాడుతూ బూతు స్థాయి నుండి కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లి ప్రజలను సమన్వయం చేస్తూ పోరాటాలు చేస్తామని తెలిపారు. మా పై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన *రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారికి*,రాష్ట్ర కో-ఆర్డినెటర్స్ *దేవోర్ల.గంగాధర్* గారికి, *సదుర్లా.మల్లేష్* గారికి, జిల్లా అధ్యక్షులు యెర్రా.కామేష్ గార్లకు ధన్యవాదాలు తెలిపారు
Post A Comment: