CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆరు లక్షల విలువ చేసే గంజాయిని స్వాదీనం చేసుకున్న భద్రాచలం పోలీసులు.

Share it:

 


వివరాలను వెల్లడించిన భద్రాచలం ఏఎస్పీ వినీత్.జి ఐపీఎస్

మన్యం టీవీ కొత్తగూడెం

నిన్న అనగా జూన్ 15వ తేదీ సాయంత్రం 5.00 గంటల సమయములో భద్రాచలం ఇన్స్పెక్టర్ టి.స్వామి తన సిబ్బందితో కలిసి భద్రాచలం బస్ స్టాండ్ సమీపములో వాహనములు తనిఖీ చేయుచుండగా నలుగురు వ్యక్తులు చేతిలో బ్యాగులు కలిగి అనుమానాస్పదంగా తిరుగుచుండగా వారిని పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద గల బ్యాగులలో గంజాయిని గుర్తించడం జరిగిందని భద్రాచలం ఏఎస్పీ వినీత్.జి ఐపీఎస్ వెల్లడించారు.వారి వద్ద నుండి సుమారుగా రూ.6,00,000/-ల విలువ చేసే 40 కేజీల గంజాయిని మరియు TS04EK7504 అను నంబరు గల యమాహా మోటార్ సైకల్ ను స్వాధీన పరుచుకోనైనది.


పట్టుబడిన వారి వివరాలు


1).మహమ్మద్ ఇంతియాజ్ S/o.ఇలియాజ్, 22 వయస్స శ్రీనగర్ కాలనీ, ఖమ్మం.

2).కొర్రా ధారా బాబు, వయస్సు 20 సంవత్సరాలు గ్రామం, జి.కే.వీధి మండలం, విశాఖపట్నం జిల్లా,ఆంద్రప్రదేశ్. 

3).ముత్తినేని కిషన్ కుమార్, s/o వెంకటేశ్వర్లు, 26 సంవత్సరాలు, రాపర్తినగర్, ఖమ్మం. 

4).మహమ్మద్ ముజామిల్ 19 సంవత్సరాలు, ఖిల్లా బజార్, ఖమ్మం. వీరితో పాటు మరో నలుగురు ఒక ముఠాగా ఏర్పడి సుమారు రెండు సంవత్సరాల నుండి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొర్రా ధారబాబు వీరికి గంజాయి సరఫరా చేస్తున్నాడని తెలిపారు. ఇతను 2020-2021 సంవత్సరములలో ఇప్పటివరకు రూ.1,28,70,000/-విలువ చేసే 859 కేజీల గంజాయిని వీరికి సరఫరా చేసినట్లు విచారణలో తేలిందని అన్నారు.ఇతనిపై గతంలో భద్రాచలం పోలీసు స్టేషన్లో (08) గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని తెలియజేసారు.ముత్తినేని కిషన్ కుమార్ వీరికి ఆర్దిక సహాయం చేస్తూ,వీరి వద్ద నుండి గంజాయి తీసుకొని మిగతవారి ద్వారా ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో విక్రయిస్తున్నాడు. ఇతనిపై (04) కేసులు నమోదు అయి ఉన్నాయి.వీరందరిపై ఎన్‌డి‌పి‌ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి కోర్ట్ నకు జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది.పరారీలో ఉన్న నిందితుల గురించి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

Share it:

Post A Comment: