CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

అన్నపురెడ్డిపల్లి మండల కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Share it:

 


 అన్నపురెడ్డిపల్లి;మన్యం మీడియా(జాన్-02):: తరతరాలుగా ఎందరో మహానుభావులు , ఉద్యమకారులు చేసిన పోరాటాలు, తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సమయంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,అన్నపురెడ్డిపల్లి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ-సున్నం లలిత చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అదేవిధంగా స్థానిక రక్షకభట నిలయం నందు సబ్ ఇన్స్పెక్టర్-పి తిరుపతిరావు , రెవెన్యూ కార్యాలయం నందు తహసీల్దార్-భద్రకాళి, వ్యవసాయ కార్యాలయం నందు ఏఈఓ-ప్రశాంత్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు . ఈ కార్యక్రమాలలో స్థానిక సర్పంచ్ బోడా పద్మ ,మండల ప్రజా పరిషత్ సూపర్డెంట్- శ్రీనివాసరావు , మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్-మధుసూదన్ , జూనియర్ అసిస్టెంట్-స్టెల్లా , ఏఈఓ-సంధ్య , పర్సా వెంకటేశ్వరరావు , రెవెన్యూ శాఖ సిబ్బంది , పోలీస్ శాఖ సిబ్బంది , మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: