CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతుబంధు పథకం రైతులకు గొప్ప వరం లాంటిది జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు

Share it:

 


• అంకిరెడ్డి కృష్ణారెడ్డి.

చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిది :

సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులకు గొప్ప వరం లాంటిదని భద్రాద్రి జిల్లా  రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం చండ్రుగొండ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యావత్ భారతదేశంలో అనేక రాష్ట్రాలు తెలంగాణ పథకాలు వైపు చూస్తున్నాయని ఈ ఘనత రాష్ట్ర సర్కారుకే దక్కుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు కష్టపడి వ్యవసాయం చేస్తున్న అప్పటి ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. నేడు ఆ పరిస్థితి లేకుండా రైతులకు పెట్టుబడి సాయం గా రాష్ట్ర ప్రభుత్వమే ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తుందని అలాగే రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ కార్య క్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎస్డి రసూల్, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్ రావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ బోజ్యా నాయక్, ప్రధాన కార్యదర్శి చీదెళ్ళ పవన్, జిల్లా నాయకులు సారెపల్లి శేఖర్, మండల రైతు కోఆర్డినేటర్ గాదె లింగయ్య, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, గుగులోత్ రమెష్, చలపతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: