CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

గుడివాడ శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా గొత్తికోయలకు నిత్యావసరాలు పంపిణీ

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


 మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా కుసుమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని రేగులగూడెం గుత్తి కోయలకు బియ్యం నిత్యావసర సరుకులు, గుడ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిధులగా టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల ఇంచార్జ్ తుమ్మల మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీ నారాయణ హాజరై వారికి అందజేశారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ కరోనా బారిన పడిన వ్యక్తులు అధైర్యం పడకుండా మనోధైర్యంతో వుండాలని సూచించారు. అదేవిధంగా కరోనా సోకిన వారు వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం మండల అధ్యక్షుడు గడదాసు సునీల్ , పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్, వైస్ ఛైర్మన్ కాడబోయిన నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల అధికార ప్రతినిధి కటికనేని దినకర్, మండల ఉపాధ్యక్షులు చిట్టిమల్ల సమ్మయ్య, , మండల యూత్ నాయకులు కన్నా సంపత్,యాసం హరీష్, నరహరి, వంశీ, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: