CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మావోయిస్టు దళ సభ్యుడు లొంగుబాటు

Share it:

 


*మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి.

*ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం రోజున జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఐపీఎస్ ముందు మణుగూరు స్పెషల్ గెరిల్లా దళం కి చెందిన మడకం నంధాల్ అనే మావోయిస్టు లొంగిపోయాడు. మడకం నంధాల్@నందుS/o దేవ, వయసు:20,గుత్తి కోయ R/o కౌరు గుట్ట గ్రామం,మండలం పామేడ్,జిల్లా బీజాపూర్, చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ఇతను చిన్నతనంలో తల్లి మరణించింది. మావోయిస్టు అనుబంధ సంస్థ బాలల సంఘంలో మూడు సంవత్సరాలు పని చేశాడు. ఇతని తండ్రి బాగా తాగి రోజు కొట్టడం వల్ల ఇతని దగ్గర బంధువు పరిచయంతో పసర దగ్గర గుండ్ల వాగు ప్రాజెక్టులో పని చేసుకుంటూ బూడిద గడ్డ లో ఉన్నాడు. అనంతరం చత్తీస్ఘడ్ లో సోముడు అనే మావోయిస్టు పరిచయం ద్వారా 2018 సంవత్సరంలో చర్ల అరుణ అక్క దళంలో దళ సభ్యుడిగా సంవత్సరం పని చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ అయినా అజాద్ ఆదేశాల మేరకు మణుగూరు దళంలో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ లచ్చన్న కు గార్డుగా పని చేశాడు. లచ్చన్న కు గార్డుగా పని చేసిన సమయంలో ఇతను బట్టుమ్ ఫైరింగ్, పెద్ద మిడిసిలేరు రోడ్డు బ్లాస్టింగ్ లో, జెరం ఏరియా టేకులగూడెం వద్ద జరిగిన కాల్పుల్లో 24 మంది సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చనిపోయిన ఘటన లో కూడా పాల్గొన్నాడు. ఇతన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సరైన వైద్యం అందక మావోయిస్టు పార్టీని వీడాలని నిర్ణయించుకొని శుక్రవారం ములుగు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయాడు. అనంతరం ఇతనితో మాట్లాడగా మావోయిస్టు పార్టీలో చాలామంది కరోనా వ్యాధితో బాధపడుతున్నారని మావోయిస్టు పార్టీలో సరైన వైద్యం అందించకపోవడంతో చాలామంది యూజి క్యాడర్ మావోయిస్టులు మరణిస్తున్నారని తెలిపాడు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుండి అందవలసిన ప్రోత్సాహకాలను అందజేస్తామని మావోయిస్టులు అజ్ఞాత వాసాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ఓఎస్డి శోభన్ కుమార్,ములుగు ఏ ఎస్పి సాయి చైతన్య ఐపీఎస్, ఏ ఎస్పి చెన్నూరి రూపేష్ ఐపీఎస్ పాల్గొన్నారు.

Share it:

Post A Comment: