మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు లో సిపిఐ మండల సమితి సమావేశంలో సిపిఐ మండల నాయకులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ.. జూలూరుపాడు మండల కేంద్రంలో బస్టాండ్ మరియు మల మూత్ర విసర్జన శాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ మరియు మల మూత్ర విసర్జన శాలలు లేక మండల కేంద్రానికి నిత్యం వేలాదిమంది నిత్యవసర వస్తువులు కొనుగోలు కొరకు, ఎమ్మార్వో ,ఎంపీడీవో, కార్యాలయానికి పోలీస్ స్టేషన్లకు, బ్యాంకుల, పని నిమిత్తం వచ్చే ప్రజానీకం ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయంపై ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్పందించి వెంటనే ఏర్పాటు చేయాలని షేక్ నాగుల్ మీరా డిమాండ్ చేశారు. అదేవిధంగా నిత్యం ప్రజలు సందర్శించే ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎల్లంకి మధు, దేవినేని జనార్దన్, చింతా స్వరాజ్ రావు, కుక్కల బిక్షం, కంపసాటి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: