CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సంక్షేమంలో తెలంగాణ దే అగ్రస్థానం

Share it:

 


👉తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు


కొత్తగూడెం లో అంబరాన్నంటిన సంబరాలు

మన్యం మీడియా డెస్క్:


అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఉద్యమంలా చేపట్టి నేడు సంక్షేమ రంగంలో రాష్ట్రం ప్రధమస్థానంలో ఉందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో నిర్వహించిన అవతరణ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి అమర వీరుల స్థూపానికి పూల మాలలు వేసి అమరులకు జోహార్లు అర్పించి వారి త్యాగాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాల పాటు సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరులైన అమరవీరుల త్యాగాలు వృధాకాకుండా ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రసాధనలో 14. సంవత్సరాలు ఏకలిగిన మడిమ తిప్పకుండా ప్రజానీకాన్ని ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన నాటి ఉద్యమనేత నేటి ముఖ్యమంత్రి. కెసిఆర్ తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ చచ్చుడో అని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేసేందుకు ఆనాటి నుండి నేటి వరకు ఇచ్చిన హామీలను నేరువేర్చుతూ ముందుకు పోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ప్రజలకు ధైర్యాన్నిచ్చి బంగారు . తెలంగాణ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఆదివాసీ గ్రామాల్లో నీటివల్లనే సగం వ్యాధులు సంక్రమిస్తున్నాయని గమనించిన ముఖ్యమంత్రి మిషన్ బగీరథ చేపట్టి మారుమూల కుగ్రామాలకు సైతం నేడు త్రాగునీరందిస్తున్నామని చెప్పారు. దహదారి సౌకర్యం కూడా సరిగా లేనటువంటి దొంగతోగు గ్రామంలో మిషన్ బగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందిస్తున్నామని చెప్పారు. నీరివ్వకపోతే ఆనాడు రానున్న ఎన్నికల్లో పోటీ కూడా చేయమని చెప్పి మిషన్ బగీరథ చేపట్టి నీరందిస్తున్నామని చెప్పారు. మన్యంలో గతంలో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలి అనేక గ్రామాల ప్రజలు వ్యాధి బారిన పడిన సంఘటనలున్నాయని, నేడు ఆ పరిస్థితిని అధిగమించామని చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేయబడిన రాష్ట్రానికి ఎటువంటి సహాకారం లేకపోయినా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. పదావుపడిన చెరువులను బాగుచేసుకుని నీటి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మిషన్ బగీరథ ద్వారా చెరువులు పునర్నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల నేడు చెరువుల్లో నీటి శాతం పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లో భూ గర్భజలాలు సైతం పెరిగినట్లు చెప్పారు. తద్వారా చెరువులు క్రింద సాగవుతున్న పంట పొలాలకు సమృద్ధిగా సాగు నీరందిస్తున్నామని చెప్పారు. కేంద్రప్రభుత్వ సహాకారం లేకుండా స్వశక్తితో అతి తక్కువ సమయంలో అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం పూర్తి చేశామని, ప్రాజెక్టు నిర్మాణాన్ని యావత్తు దేశం కొనియాడుతున్నట్లు చెప్పారు. మన జిల్లాతో పాటు ఖమ్మం, మహబూబాద్ జిల్లాలలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని తెలిపారు. సీతమ్మ సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు సాగునీటి సమస్యను పూర్తిగా తొలగించనున్నట్లు చెప్పారు. గతంలో రైతులు భూమి శిస్టులు చెల్లించే స్థితి నుండి నేడు రైతుకే వ్యవసాయ పెట్టుబడికి ప్రభుత్వం సాయమందించేందుకు రైతుబంధు పథకం చేపట్టి సంవత్సరానికి ఎకరాలకు 10 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతుభీమా ద్వారా మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగితే విద్యుత్ ఉండదు. ఈ ప్రాంతం చీకటి మయమవుతుందని ఆనాడు చెప్పారని, కానీ నేడు పెద్దఎత్తున విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టి విద్యుత్ సమస్యను అధిగమించి ఇటు వ్యవసాయానికి, అటు పారిశ్రామిక రంగానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందచేస్తున్నామని చెప్పారు. విద్యుత్ ఉత్పాదనకు చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున అమలు చేస్తున్న సమయంలో మాయదారి కరోనా వ్యాధి వల్ల ఆర్ధికంగా ఇబ్బంది ఎదురైనా పర్యాలేదు కానీ ప్రజలు ప్రాణాలు ముఖ్యమని భావించి పటిష్టంగా లాక్డౌన్ అమలు చేసి వ్యాధిని నియంత్రణలోకి తెచ్చినట్లు చెప్పారు. మొదటి దశ కరోనా వ్యాప్తిలో వలస కూలీలకు నగదు, ఉచిత బియ్యం పంపిణీ చేపట్టామని చెప్పారు. రెండవ దశ కరోనా వ్యాప్తిలో కరోనాను కట్టడి చేసి జిల్లాను రక్షించుకుందామని చెప్పారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చేస్తున్న కృషిలో ప్రజలతో కలిసి పనిచేసేందుకు ముఖ్యమంత్రి శాసనసభ్యుల వేతనాలను సైతం తీసుకున్నారని చెప్పారు. కరోనా వల్ల రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా జరుపుకోలేక పోయామని రానున్న రోజుల్లో కార్యక్రమాన్ని మరింత గొప్పగా జరుపుకుందామని ఆయన చించారు. అనంతరం 1969 ఉద్యమకారులను శాలువాతో సన్మానించారు.



ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కొత్తగూడెం, ఇల్లందు శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు, హరిప్రియ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ సీతాలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: