CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గ పోరు

Share it:

 


👉భాద్రద్రి జిల్లాలో అదే పరిస్థితి

👉ఒక వర్గం ఎమ్మెల్యే పొదేం తో టచ్ లో, మరో వర్గం ఎమ్మెల్యే సీతక్క తో 

👉 రెండు వర్గాల చీలిక

👉🏻ఓకే కార్యక్రమాన్ని రెండు వర్గాలు గా చిలీ చేపడుతున్న వైనం

👉అయోమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

✍️కొత్త దామోదర్ గౌడ్

మన్యం మీడియా డెస్క్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ముఖ్యనాయకులు పార్టీని వినడంతో హస్తం పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది ముఖ్యంగా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం పినపాక మణుగూరు అశ్వాపురం బూర్గంపాడు ఆళ్ల పల్లి గుండాల లో నానాటికీ వర్గ పోరు తీవ్రంగా ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య వర్గం కాంగ్రెస్ పార్టీ మండలాల బాధ్యులుగా ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చిన పలుచోట్ల వర్గాలుగా చీలి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.మణుగూరు లో ఈ మధ్య కాలంలో పెట్రోల్ బంకు ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వర్గాలు వీడి కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన మరో వర్గం వారు జాతీయ మహిళా కాంగ్రెస్ నాయకురాలు ములుగు ఎమ్మెల్యే సీతక్క కు టచ్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో ఆమె పినపాక నియోజకవర్గం లోని పలువురు కాంగ్రెస్ కార్యకర్తల కార్యక్రమాలలో పాల్గొన్నది. అలాగే ఎమ్మెల్యే సీతక్క ను ములుగు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భాద్రద్రి జిల్లాకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరచూ కలుస్తూ వారి గోడును వెళ్లబోసుకున్నారు. ఇలా వర్గ పోరు తో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. సమీప భవిష్యత్తులో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Share it:

TELANGANA

Post A Comment: