CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గంజాయి తరలిస్తున్న ముఠా పట్టివేత

Share it:

 


మన్యం టీవీ, భద్రాచలం టౌన్:

భద్రాచలం A.S.P శ డా. జి. వినీత్   తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం  04:00 గంటల సమయంలో  భద్రాచలం పట్టణ సిఐ స్వామి  ఆద్వర్యంలో పట్టణ ఎస్.ఐ S. మధు ప్రసాద్  మరియు సిబ్బంది కలిసి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక హోండా షైన్ MH 27 CR 0644 నెంబర్ గల మోటార్ సైకిల్ మరియు బెలోనో MH 27 BZ 2011 నెంబర్ గల వాహనాలలో, ఐదుగురు  వ్యక్తులు  అనుమానాస్పదంగా వస్తూ కనిపించగా వారి వాహనాల్ని తనిఖీ చేయగా  ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించినారు. ఈ తనిఖీ లో వీరి  వద్ద 28 కేజీల గంజాయి లభించింది. దీని విలువ సుమారు 4,20,000/- రూపాయలు గా  ఉండును.   ముద్దాయిలను   విచారించగా వారి  పేర్లు  1.అస్లాం, 2.సాజిద్, 3.అస్కమ్ ఖాన్, 4.లఖన్ పవన్ శర్మ, 5.షోయబ్ షా, అని వీరందరూ అమరాతి  జిల్లా, మహారాష్ట్ర కు చెందినవారని  చెప్పినారు. 

వీరు ఈ గంజాయిని ధారకొండ ప్రాంతం విశాఖపట్నం జిల్లా నుండి మహారాష్ట్ర కు   తీసుకు వెళ్తున్నారని చెప్పినారు. భద్రాచలం పట్టణ సరిహద్దులలో  24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి మరియు మరే యితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి.స్వామి , పట్టణ ప్రొబేషనరీ ఎస్.ఐ. నీరేశ్  మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: