CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల సమస్య పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

Share it:

 


*హరిత హరం పేరుతో పోడు భూములు లాక్కునే కుట్ర చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం.

*గత కాంగ్రెస్ హయం లో పొడు భూములకు పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం మాత్రం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది.

*కొత్త పోడు కొట్టేది లేదు పాత పోడు వదులు కునేది లేదు.

*పోడు రైతులు ఏకం కావాలి పోడు రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.

*పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.

*కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో   కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ హయం లో పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరిత హరం పేరుతో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని 

గత కొన్ని రోజులుగా ములుగు నియోజకవర్గ   వ్యాప్తంగా పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ రైతులను

బాయాబ్రంతులకు గురి చేస్తున్నారని  ఫారెస్ట్ అధికారులు రైతుల పై దాడులు చేస్తూ భూముల చుట్టూ స్ట్రెంచ్ లు కొడుతున్నారని వారు ఫారెస్ట్ అధికారుల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు  2014 ఎన్నికల సమయములో కెసిఆర్ ప్రభుత్వం  పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం 7 ఏండ్లు గడిచిన ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పొగ హరితరం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని  బడ్జెట్ సమావేశములో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సంబంధిత మంత్రి, ముఖ్య మంత్రి తో మాట్లాడుతానని చెప్పిన మంత్రి ఇప్పటి వరకు దాడుల పై స్పందించక పోవడం బాధాకరం అని పోడు భూముల చుట్టూ ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ కొట్టుతుండగా రైతులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడం జరుగుతుందని వెంటనే ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని లేని యెడల పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సీతక్క  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 గత 30 యేండ్ల నుండి సాగు చేసుకున్న భూములను ఫారెస్ట్ అధికారులు హరిత హరం పేరుతో పోడు భూముల చుట్టూ స్ట్రెంచ్ కొడుతూ బాయబ్రంతులకు గురి చేస్తున్నారని  అన్నారు. ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీతక్క అన్నారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెలకు మారస్వామి,

కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాణోత్ రవి చందర్, వివిధ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, మైల జయరాం రెడ్డి,

జాడి వెంకటేశ్వర్లు,గంగారాం జెడ్పీటీసీ ఈసం రమ,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,

సర్పంచ్ ఆంకి రెడ్డి,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,పొట్లపూర్ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: