పచ్చని ప్రకృతి వనాల పట్ల సంతోషం వ్యక్తం చేసిన
ఎంపీపీ గుమ్మడి గాంధీ
కొన్ని నిర్మాణాల పట్ల పూర్తి అసహనం వ్యక్తం చేసిన ఎంపీపీ
మన్యం మనుగడ, పినపాక:
పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో పంచాయతీలలో గల ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలను పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏడూళ్ల బయ్యారం పంచాయతీ లో గల ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించిన ఎంపీపీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రకృతి వనాన్ని నిర్మించిన సర్పంచ్ కోరం రజిని, పంచాయతీ సెక్రెటరీ హరీష్ లను మెచ్చుకున్నారు. ప్రతి పంచాయతీ ఏడూళ్ల బయ్యారం ను ఆదర్శంగా తీసుకొని పని చేయాలని, అతిపెద్ద పంచాయితీ అయినప్పటికీ, ఓపికతో ఆహ్లాదకరమైన ప్రకృతి వనాన్ని నిర్మించారని కొనియాడారు. అనంతరం ఎల్చిరెడ్డి పల్లి పంచాయతీ ప్రకృతి వనం, డంపింగ్ యార్డులను దర్శించారు. పాత రెడ్డిపాలెం వైకుంఠధామం డంపింగ్ యార్డ్ నిర్మాణం గురించి, కాంట్రాక్టర్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆ నిర్మాణాలని అతి త్వరలో పూర్తి చేసేలా చూడాలని పంచాయతీ సెక్రటరీ కి చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, టిఆర్ఎస్ మండల నాయకులు సత్తిబాబు తదితరులు పాల్గొనడం జరిగింది
Post A Comment: