మన్యం టీవీ ఏటూరు నాగారం
దళిత్ శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో జూన్ 07-2021 కలెక్టర్ కు కరోనా కట్టడి పై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు దళిత్ శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత్ శక్తి ప్రోగ్రాం ములుగు జిల్లా కన్వీనర్ సురేష్ మహా రాజు మాట్లాడుతూ, 18 ఏళ్ళు నిండిన వారందరికీ ఇంటివద్దనే ఉచిత టీకాలు అందించాలని కరోనా బారిన పడిన బాధితులందరికీ పూర్తి ఉచిత వైద్యం అందించాలని కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని అన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉచిత కరోనా చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని కరోనా బారిన పడ్డ కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. కరోనా కారణంగా పాఠశాలలు లేనందున ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న ఎస్సీ,ఎస్టీ, బిసి విద్యార్థులకు స్మార్ట్ఫోన్స్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని గ్రామాలలో కమ్యూనిటీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ ర్యాలీలో కరుణాకర్ మహారాజ్, సాంబశివరావు మహా రాజ్, తరుణ్ మహారాజ్, రాంబాబు మహారాజ్, సాగర్ మహారాజ్, సంతోష్ మహారాజ్, సతీష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: