25కేజీల బియ్యం అందజేత గ్రామ అవసరాల కోసం మరో క్వింటా బియ్యం వితరణ
మన్యం మనుగడ, మణుగూరు:
మణుగూరు ఓసి లో భారీ యంత్రాల ట్రాక్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సింగరేణి నిర్వాసిత కొత్త మల్లేపల్లి గ్రామస్తుడు గంధం రామారావు ను ఏరియా ఐ ఎఫ్ టి యు నాయకులు ఎస్ డి నా సర్ పా షా , సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శనిగరపు కుమారస్వామి లు గురువారం సాయంత్రం పరామర్శించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో రామారావు ఎడమ కాలుకి తీవ్ర గాయాలయ్యాయని భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాడని మణుగూరు ఓసి సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టర్ తగు సహకారం అందించాలని కోరారు. రామారావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రామారావు ధైర్యం చెప్పారు అనంతరం
అనంతరం గ్రామ అవసరాల కోసం ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో గ్రామస్తులకు క్వింటా బియ్యం వితరణగా అందజేశారు, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏరియా నాయకులు శనిగరపు కుమారస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని బియ్యాన్ని గ్రామస్తులు అందజేశారు , సింగరేణి నిర్వాసిత గ్రామాలకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఎనలేని సేవలు చేస్తున్నారని,ఆయన నాయకులను అభినందించారు, మల్లెపల్లి గ్రామస్తుల కష్టాలు తీరాలని ఆయన ఆకాంక్షించారు ప్రభుత్వం స్పందించి గ్రామానికి మంచి చేయాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు ఏ మంగీలాల్ గ్రామస్తులు డేగల రాజేంద్రం, జూపాక జాను, సంపత్ కుమార్, వెంకటేశ్వర్లు, గంధం ఏశవ్, సావిత్రి, మంజుల, సుందర్ రావు,D ప్రశాంత్, డేగల సాయిరాం,కర్రీ సాయి కట్ట ప్రశాంత్ ,కొంగూరి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: