CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.

Share it:

 


👉పోడుసాగుదారులకు ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేయాలి.👉57సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు నెలకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలి.👉జిల్లా వ్యవసాయ కార్మిక సంఘము(బి.కె.ఎం.యూ ) ఆధ్వర్యంలో నిరసన దీక్ష.


మన్యం టీవీ పాల్వంచ: ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం పిలుపుమేరకు మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పోడు భూముల సమస్యను కుర్చీ వేసుకొని కూర్చొని పరిష్కరిస్తామని చిలకపలుకులు పలికి ఇపుడు సమస్యను పరిష్కారం చేయకుండా అటవీ, పోలీస్ శాఖలను ఉసికలుపుతూ దాడులు చేపిస్తున్నారుని విమర్శించారు. తక్షణమే పొడుసాగుదరులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ఉపాధి హామీ పథకం బిల్లులు అందాక ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారుని తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన 57 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు ఐదు వేల పెన్షన్ ప్రతి నెల ఇవ్వాలని, అర్హులైన పెద్దలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని, కరోనా లాక్ డౌన్ వల్ల పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలందరికీ ఉచితంగా నెలకి 50 కేజీల బియ్యం, నెలకు 7500 రూపాయలు ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాలని, అర్హులైన పేద వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. *ఈ దీక్ష కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘము నాయకులు గుండాల నాగరాజు, వేములపల్లి శ్రీనివాసరావు, ముగితె వెంకట, ముత్యం, వడ్డె భద్రయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, రవి* తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: