CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ప్రధాన లక్ష్యం : ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు

Share it:

 



మన్యం టీవీ: ఇల్లందు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ లోని 24 వ వార్డు లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్న ఇల్లందు పాలకవర్గం ఇల్లందు మున్సిపాలిటీ లోని 24 వ వార్డు లో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని స్వయంగా ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పరిశీలించిన మున్సిపాలిటీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వార్డు లో జరుగుతున్న శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం పకడ్బందీగా జరగాలని కౌన్సిలర్ లకు తెలియజేశారు. వార్డులో ఏ చిన్న చందు కూడా వదలకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. డ్రైనేజీ కాలువలు ఇరువైపులా పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ. ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్ గారి సూచన మేరకు వర్షాకాల దృష్టిలో పెట్టుకొని స్పెషల్ డ్రైవ్ పట్టణ నిర్వహిస్తామని తెలియజేశారు. వర్షాకాలంలో అంటు రోగాలు ప్రబలకుండా పట్టణమంతా ప్రతి కాలువలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు రవి, సయ్యద్, నవీన్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: