మన్యం టీవీ,కరకగూడెం: కరకగూడెం మండలం లోని వలస ఆదివాసి గ్రామమైన నిమ్ముగూడెంలో ప్రాణీక్ హీలింగ్ ఫౌండేషన్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 25 మంది వలస ఆదివాసులకు కరకగూడెం ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... వలస ఆదివాసీలకు నిరంతరం వారి అవసరాలను గుర్తించి సేవ చేస్తున్న సంస్థను కొనియాడారు.. అనంతరం సంస్థ సభ్యులు,కరకగూడెం గ్రామీణ వైద్యుడు షేక్ సోందు పాషా మాట్లాడుతూ... వలస ఆదివాసులకు సేవ చేయడమే తమ ముందున్న లక్ష్యం అని పేర్కొన్నారు.. కార్యక్రమంలో సంస్థ సభ్యులు వసీం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: