మన్యం మనుగడ,మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో పినపాక నియోజకవర్గ టీఆరెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు సిరికొండ శ్యామ్ సుందర్ ఇంటి ఆవరణలో ఆరుద్ర పురుగులు బుధవారం దర్శనమిచ్చాయి. ఇవి ఎరుపు రంగులో ఉండడంతో చూపరులను ఆకర్షిస్తున్నాయి. కేవలం వర్షంకాలంలో కొద్ది రోజులు మాత్రమే ఈ పురుగులు కనబడతాయి. ఆరుద్ర పురుగులు కనిపించాలంటే ఆ సంవత్సరం వర్షాలు విస్తారంగా కురుస్తాయని, అలాగే పంటలు చేతికి వస్తాయని రైతులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
Post A Comment: