CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే విధుల నుండి తొలగిస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు.

Share it:


మన్యం టీవీ భద్రాద్రి కొత్తగూడెం :- జూన్ 18

శుక్రవారం కలెక్టరేట్ నుండి పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై మండల ప్రత్యేక అధికారులు, యంపిడిఓలు,

యంపిఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఉపాధి హామీ పథకం ఏపిఓలు, పంచాయతీ కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవెన్యూ ప్లాంటేషన్లో 10 అడుగులు, పల్లె పకృతి వనాల్లో 6 అడుగుల ఎత్తున్న మొక్కలు

నాటాలని చెప్పారు. మొక్కలు నాటేందుకు లేబర్ మొబలైజేషన్ జరగాలని, మొక్కలు నాటేందుకు రెండు అడుగులు ఎత్తు, లోతు

గుంతలు తీయాలని చెప్పారు. అవెన్యూ, పల్లె పకృతివనాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయు ప్రక్రియ వేగవంతం చేసేందుకు

అగర్ యంత్రాలను వినియోగించాలని చెప్పారు. గురువారం ఖమ్మంలో హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై రాష్ట్ర

రవాణాశాఖ మంత్రి యంపిడిఓలు, యంపిటలతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారని ఆ ప్రకారం మనందరం

సన్నద్ధం కావాలని చెప్పారు. శుక్రవారం జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీలో తాను ఆకస్మిక తనిఖీ నిర్వహించానని

పారిశుద్యం అద్వాన్నంగా ఉన్నదని తక్షణమే సంబంధిత కార్యదర్శిని విధుల నుండి తొలగించాలని డిపిటను ఆదేశించానని

చెప్పారు. యంపిడిఓ, యంపిడిఓలు అందుబాటులో ఉండకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్యం కుంటుపడిందని,

మల్టీపర్పరస్ వర్కుర్లు విధులకు హాజరు కాలేదని, చెత్తా చెదారం వ్యర్థాలు పేరుకుపోయి ఉన్నాయని, డంపింగ్ యార్డు నిర్వహణ

లేదని, వ్యర్థాలు మూలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకే యంపిడిఓ, యంపిడీలు,

కార్యదర్శులు, సర్పంచులు, ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీల్లో పర్యటించాలని, తన ఆకస్మిక తనిఖీల్లో అందుబాటులో లేని

అధికారులను తక్షణం విధుల నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. యంపిడిఓలు, యంపిఓలు కార్యస్థానంలో ఉండకపోతే

క్షేత్రస్థాయి సిబ్బంది ఏ విధంగా పని చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డులు అందుబాటులోకి తెచ్చినా వ్యర్థాలను

కాల్చుతున్నారని, తక్షణమే డంపింగ్

యార్డుల్లో వర్మి కంపోస్టు ఎరువులు తయారు చేయాలని చెప్పారు. కాకర్లలో కోవిడ్ వచ్చిన

పారిశుద్య కార్మికుడు రెండు నెలలుగా విధులకు హాజరు కానప్పటికి వేతనాలు చెల్లించారని, అట్టి నిధులను పంచాయతీ కార్యదర్శి

నుండి రికవరీ చేయాలని యంపిడిఓను ఆదేశించారు. జూలూరుపాడులో పారిశుద్యంతో పాటు అభివృద్ధి కూడా కుంటుపడిందని,

తనకు ఎందుకు కథలు చెబుతున్నారని, మీ నిర్లక్ష్యం వల్లే మండలం చాలా దారుణంగా తయారైందని, పర్యవేక్షణ చేయకుండా ఏమి

చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత ప్రకారం విధులు నిర్వహించాలని, సక్రమంగా చేయలేకపోతే ఉద్యోగానికి

రాజీనామా చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని చెప్పారు. యంపిడిఓ, యంపిఓ కార్యస్థానంలోనే ఉండి పర్యవేక్షణ

చేయాలని కార్యస్థానంలో ఉండని అధికారుల వివరాలు తనకు అందచేయాలని జడ్పీ సీఈఓ, డిపిఓలను ఆదేశించారు.

డంపింగ్ యార్డుల్లో కంపోస్టు ఎరువులు తయారు చేయమని పలు మార్లు చెప్పామని, వ్యర్థాలు సేకరణకు ట్రాక్టర్లు ఇచ్చినా

ఇంటింటి నుండి వ్యర్థాలు సేకరణ చేయడం లేదని, పారిశుద్యం పడకేసిందని, యంపిఓలు ఉండి దేనికని ప్రశ్నించారు. యంపిడిఓలు,

యంపిఓలు, కార్యదర్శులపై మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. చండ్రుగొండ మండలం గానుగపాడులో

మొక్కలు పెంపకం, పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణ బావుందని సర్పంచ్ ను, కార్యదర్శిని, యంపిడిఓను, యంపిఓను, అభినందించారు.

ప్రతి ఇంటి నుండి నూరు శాతం వ్యర్థాలు సేకరణ జరగాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారి ఏజెంట్ టు ది కలెక్టర్ అని

సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా లోతట్టు ప్రాంతాల్లో నీరు

నిల్వ ఉండే ప్రాంతాలను నాణ్యమైన మొరంతో నింపాలని, మొరంతో నింపడానికి అవకాశం లేకపోతే ఇంకుడు గుంతను ఏర్పాటు

చేసి నీటిని భూమిలో ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్లో 10 అడుగులు ఎత్తున్న మొక్కలు

మాత్రమే నాటాలని, నాటనున్న మొక్కల రకాల జాబితాను అన్ని మండలాలకు పంపామని సూచించిన మొక్కలను మాత్రమే

నాటాలని, సూచించిన మొక్కలు కాకుండా ఇతర మొక్కలు నాటితే సంబంధిత అధికారి నుండి రికవరీ చేస్తామని చెప్పారు. రానున్న

నాలుగైదు రోజుల్లో అవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పారు. సోమవారం నుండి అవెన్యూ

ప్లాంటేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలని 24వ తేదీ వరకు అవెన్యూ ప్లాంటేషన్ ప్రక్రియ యజ్ఞంలా చేపట్టి పూర్తి చేయాలని

అవెన్యూ ప్లాంటేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు 10 రూట్లుగా విభజించి ప్రతి రూటుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు.

ప్లాంట్ కేర్ యాక్టివిటి జరగాలని చెప్పారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కల వివరాలు తప్పని సరిగా రిజిష్టర్ లో నమోదు చేయడంతో

పాటు ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇంటింటికి పంపిణీ చేయనున్న మొక్కల వివరాలను గృహాల వారిగా రిజిస్టర్ లో నమోదులు

చేయాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణ

మున్సిపల్, పంచాయతీలదేనని స్పష్టం చేశారు. పల్లె నిద్ర కార్యక్రమానికి షెడ్యూలు తయారు చేయాలని చెప్పారు.

Share it:

TELANGANA

Post A Comment: