CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కష్టార్జితంతో కట్టుకుంటున్న ఇంటిని కూల్చిన వారిని అరెస్ట్ చేయాలి

Share it:


- దారుణంగా కబ్జాలు, దౌర్జనాలకు పాల్పడుతున్న అధికార పార్టీ గుండాలు

-గిరిజన మహిళపై దాడి కి పాల్పడిన నిందితులపై చర్యలు ఏవీ...?

-బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్

మన్యం మనుగడ, పాల్వంచ : కాయకష్టం చేసుకుని... రూపాయి రూపాయి కూడపెట్టి తన కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్న గిరిజన మహిళపై అకారణంగా దాడి చేసి ఇంటిని కూల్చివేసిన నిందితులను అరెస్ట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన  

పాల్వంచ పట్టణ పరిధిలోని జయమ్మ కాలనీలో పర్యటించారు. ఇటీవల కూల్చివేసిన ఇంటిని సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న లవుడియా సంధ్య అనే గిరిజన మహిళ కూలి పని చేసుకుంటూ నిర్మించుకున్న ఇంటిని కొందరు అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా కూల్చివేశారని ఆరోపించారు. దాడి జరిగిన అనంతరం బాధిత మహిళ ఈ నెల 18న ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారని, కేసు నమోదు చేసి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రెండు సంవత్సరాలుగా ఎక్కడికక్కడ కబ్జాలు, ఎదురు తిరిగితే దాడులు చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి నిందితులను అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దాడి ఈ నెల 18వ తేదీన దాడి జరగ్గా బాధితురాలు ఫిర్యాదు చేస్తే, ఈ నెల 22వ తేదీన నమోదు చేశారని, కేసు నమోదు చేసి రోజులు గడుస్తున్నా నిందితులు అధికార పార్టీ అండదండలతో బయట తిరుగుతున్నా, వారిని అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. టీఆర్ఎస్ అధికారంలో దళిత, గిరిజనులపై దాడులు యదేశ్చగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఆరుగాలం కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చివేయడంతో గిరిజన మహిళ సంధ్య పడుతున్న వేదన వర్ణనాతీతంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలు, దౌర్జనాలకు అడ్డూఅడుపు లేకుండా పోతోందని అన్నారు.దాడులు, కబ్జాలు, ఆక్రమణలు జరగకుండా ఉండాలంటే పోలీసులు తక్షణమే సంధ్యపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోళ్ళపూడి ప్రవీణ్, ఏడేల్లి శ్రీను,భాస్కర్,ధనుజయ్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: