మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండల పరిధిలోని మొండికుంట గ్రామ పంచాయతీ లో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, పాలకవర్గం ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం సందర్భంగా బుదవారం గ్రామ పంచాయతీ లో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర లో గ్రామంలో సమస్యలు గుర్తించి పల్లె ప్రగతి లో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో రవీంద్ర ప్రసాద్, ఎంపీఓ శ్రీనివాస్, ఉప సర్పంచ్ సుధీర్, ఎంపీటీసీ కమటం నరేష్, పంచాయతీ కార్యదర్శి సైదులు, వార్డ్ సభ్యులు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: