*పోలీసులపై హత్య నేరం కేసు పెట్టాలి మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి.
*తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివ కుమార్.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన దళిత కుటుంబంపైన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసు మోపబడి అంబటిపూడి మరియమ్మ అనే దళిత మహిళ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కు గురైన ఘటన పైన ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జీ తో విచారణ జరిపించి సంబంధిత బాధ్యులపైన ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసుతో పాటు హత్యానేరం కేసులను నమోదు చేసి కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతు రాష్ట్రంలో ఫ్రెండ్లి పోలీసులు రాక్షసంగా ప్రవర్తించి దళిత మహిళను మరియమ్మను బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్ మర్మావయవాలపై విచక్షణ రహితంగా కొట్టడడం వల్ల ప్రస్తుతం ఖమ్మం లో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే కుదరదన్నారు.తక్షణమే పోలీసులపై హత్యానేరం తో పాటు ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేసి శిక్షించాలన్నారు.బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు బంగారు తెలంగాణ రాష్ట్రంలో అనునిత్యం దళితులపైన దాడులకు, హత్యలకు, వెలివేతలకు, అణిచివేతలకు గురి అవ్వడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ చట్టాన్ని కాపాడవల్సిన పోలీసులు, అధికారులే ఇలాంటి ఘటనలు పాల్పడటంతో దళితులపైన దాడులు, కుల దూరంహంకార హత్యలు రాష్ట్రంలో పెచ్చరిల్లిన అధికార పార్టీకి ఏమి పట్టనట్టుగా చోద్యం చూస్తున్నారని వారు విమర్శించారు. ఏదైనా కేసు నిమిత్తం అనుమానితుల పైన పోలీసులు ఇంతటి క్రూరంగా వ్యవహరించడమీ కాకుండా నేరాన్ని బలవంతంగా ఒప్పుకునే దాకా హింసించడం ఈ కాలంలో కూడా నడుస్తుండడం అత్యంత బాధాకరమని వారు ఆవేదన వ్యక్తంచేశారు. నాటి నుంచి నేటి వరకు లాకప్ డెత్ లు జరుగుతుండడం పైన సభ్యసమాజం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మరియమ్మ లాకప్ డెత్ కు పాల్పడిన, ఆమె కుమారుడైన ఉదయ్ మర్మాంగ అవయవాలపైన అతికిరాతకంగా దాడికి పాల్పడిన పోలీసులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివ కుమార్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి 3 ఎకరాల ప్రభుత్వ భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Post A Comment: