విత్తనాల దుకాణాలను తనిఖీ చేసిన ఎ ఎస్పీ శబరిష్ ఐపీఎస్
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని విత్తనాల దుకాణాలపై ఏఎస్పీ శబరీష్ ఐపీఎస్,సిఐ భాను ప్రకాష్,వ్యవసాయ శాఖ అధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ లోని విత్తనాల దుకాణంలో తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు.రైతులకు నాశిరకం నకిలీ విత్తనాలను విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నకిలీ, ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలను నిల్వ ఉంచిన గోదాముల పై చర్యలు తీసుకుంటామన్నారు.షాపు నిర్వాహకుల ఇళ్లల్లో కూడా వ్యవసాయ,పోలీసు అధికారులు సోదాలు నిర్వహించారు.రైతులకు కూడా నకిలీ విత్తనాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నారు.విత్తనాలు కొనేటప్పుడు డీలర్ నుండి బిల్లు తీసుకోవాలన్నారు. గడువు ముగిసిన విత్తనాలను మళ్లీ ప్యాక్ చేసి వాటిని అమ్ముతున్నట్లు సమాచారం ఉందని, అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు ఏ ఎస్పీ శబరిష్ తెలిపారు.ఈ తనిఖీలలో మణుగూరు సిఐ భాను ప్రకాష్,వ్యవసాయ అధికారి ఇంచార్జ్ ఏవో వినయ్,ఏ ఈవోలు వీరేంద్ర నాయుడు, హారిక తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: