CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డిగ్రీ ప్రవేశాల కొరకు "దోస్త్" నోటిఫికేషన్ విడుదల

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

ఉన్నత విద్యా మండలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల  ప్రవేశం కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1 జులై నుండి  17 జూలై వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కలిగించారు. రిజిస్ట్రేషన్ కొరకు 200/-  రూపాయల రుసుమును నిర్దేశించారు.  జూలై 3 నుంచి 16వ తేదీ వరకు  తొలివిడత వెబ్ ఆప్షన్ల నమోదు అవకాశం కల్పించారు. జులై 22 నుండి తొలివిడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరగనుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్ తెలిపారు. 


కావలసిన ధ్రువపత్రాలు:-


విద్యార్థులు ఇంటర్ మెమో, ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, మొబైల్ ఆధార్ లింక్ కలిగిన మొబైల్, స్టడీ సర్టిఫికెట్స్ తీసుకొని కళాశాల నందు సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.శ్రీనివాస్ పత్రికా ప్రకటనలో కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు ల్యాబ్ సౌకర్యాలు, లైబ్రరీ, ప్లేగ్రౌండ్ వంటి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని కావున విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్రవేశం పొందాలని కోరారు.


అందుబాటులో ఉన్న కోర్సులు:-


ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు బి ఏ తెలుగు మీడియం, బిఏ ఇంగ్లీష్ మీడియం, బిఏ కంప్యూటర్స్, బికాం కంప్యూటర్స్, బి ఎస్ సి జనరల్ మరియు కంప్యూటర్,  బి జెడ్ సి జనరల్ మరియు కంప్యూటర్స్  వంటి కోర్సులు అందుబాటులో కలవు అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: