CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ఆశయసాధకుడుఈ ఉపాధ్యాయుడు

Share it:

  సేవా కార్యక్రమం లో దూసుకుపోతున్న సత్తు లాల్

   గుండాల  ( మన్యం టీవీ) ఆశయసాధకుడుఈ ఉపాధ్యాయుడు  సేవా కార్యక్రమం లో దూసుకుపోతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు సత్తు లాల్.  మండలం పరిధిలోని  బాట అన్న నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సత్తు లాల్ చేతన ఫౌండేషన్ సభ్యుడిగా చేరాడు. చేరిన నాటి నుండి సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు . గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ  ముందుకు సాగుతున్నాడు. సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో చేతన పౌండేషన్ లో చేరి గిరిజనులకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నాడు . ఉపాధ్యాయ  విధుల కు రోజు హాజరవుతూ నే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు. ఆదివారం ఆళ్లపల్లి మండలంలోని దట్టమైన అడవిలో ఉన్న వలస ఆదివాసీల గ్రామాలైన బూసి రాయి సింగారం గ్రామాల్లో కాలినడకన చేరుకొని కరోనా మందులతోపాటు బ్రెడ్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్ లను వారికి అందజేశాడు.  దట్టమైన అడవిలో ఉన్న ఈ గ్రామాలకు వెళ్లాలంటే స్థానికులే భయపడతారు అలాంటి గ్రామాలను సందర్శించి వలసవాదుల ను ఆదుకోవడం ని పలువురు అభినందిస్తున్నారు. గతంలో సైతం గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో చేతన పౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించాడు మన్యం టీవీ

Share it:

TELANGANA

Post A Comment: