CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కా, హిడ్మ కా. శారద కరోనా వైరస్ తో చనిపోయారనే ప్రచారం అబద్దం

Share it:


భారత కమ్యూనిస్టు పార్టీతెలంగాణ రాష్ట్ర కమిటీ

అధికార ప్రతినిధి

జగన్ (మావోయిస్టు)

మన్యం మనుగడ డెస్క్:

పాలకులు, పోలీసులు కావాలనే ఉద్ద్యేశ పూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే అని భారత కమ్యూనిస్టు పార్టీతెలంగాణ రాష్ట్ర కమిటీ

అధికార ప్రతినిధి జగన్ (మావోయిస్టు) పేర లేఖ విడుదలైనది.లేఖ సారాంశం ఇలా ఉంది.

పోలీసులు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని నమ్మకండి. కా ,శారద, కా. హిడ్మా ఆరోగ్యంగానే వున్నారు. పాలకులు, ప్రభుత్వాలు కావాలనే ఉద్ద్యేశ పూర్వకంగా దుష్ప్ర‌చారం చేస్తున్నారు. వాటిని నమ్మి కుటుంబ సభ్యులు, ప్రజలు గందర గోళ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలను పార్టీ అధికారికంగా నిజాలను తెలియ జేస్తుంది. అప్పుడు మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.


మావోయిస్టులు కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దళ సభ్యులను బయటికి వెళ్ళకుండా బలవంతంగా అడ్డుకుంటున్నారని, బయటికి వస్తే మెరుగైన వైద్యం అందిస్తామని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కా.గంగాల్ ను, కా.శోబ్రాయ్ లను తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ కు పంపిస్తే పక్కా సమాచారంతో అరెస్టులు చేసి వారికి వైద్యం అందకుండ చేసి

నీచంగా హత్య చేసిన కుటిల నీతి కలిగిన కసాయి ప్రభుత్వాలు, పోలీసులు మళ్ళీ ప్రజలను నమ్మించడానికి, శ్రేయోభిలాషి లాగా హితవులు పలుకుతున్నారు.


మా కామ్రేడ్స్ ను హస్పిటల్ కు వెళ్ళి పట్టుకొని చంపిన విషయం ప్రజలెవరు ఇంకా మరిచి పోలేదు. అదే విధంగా ప్రజల కోసం పోరాడుతున్న వారికి వైద్య అవకాశాలు కల్పించకుండా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ ని నిర్మూలించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని కౄర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ కారణంగానే కామ్రేడ్ హరిభూషణ్, కామ్రేడ్ భారతక్క లకు సరైన వైద్యం అందించ లేక పోయాము. వాస్తవానికి ఈ కామ్రేడ్స్ చనిపోయే ఒక రోజు ముందు ఇన్ఫార్మర్ల‌ ద్వారా పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్, చత్తీస్ గడ్ సంయుక్తంగా వందలాది మంది పోలీసులు దాడి చేయడానికి ఆపరేషన్ చేపట్టారు. మా ప్రజల ద్వారా పోలీసుల సమాచారం తెలుసుకొని మా కామ్రేడ్స్ ను కాపాడుకోవాడానికి వారిని మోసుక తిరిగాము. ఈ నిర్బంధం మద్యనే బ్రతికించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాము. కాని బ్రతికించుకోలేక పోయాము. ఇంకా కా.శారద, కా. హిడ్మి చని పోయారని ప్రజల్లో ప్రచారం చేసి ఒక పెద్ద గందర గోళాన్ని, భయాన్ని ప్రజల్లో సృష్ఠంచడానికి పోలీసులు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారు.


మేము కరోనాకు అతీతులమేమీ కాదు. ప్రజల మద్యనే జీవిస్తున్నాము. అన్ని సెక్షన్ల ప్రజలను కలుస్తుంటాము. మాకు కరోనా సోకే అవకాశం లేక పోలేదు. అందులో భాగంగానే కరోనా వైరస్ సోకి, కా, హరిభూషణ్, కా, భారతక్క లు భౌతికంగా ప్రజలకు దూరమయ్యారు. అందుకు ప్రభత్వాలు అమలు చేస్తున్న పాశవిక నిర్బంధం కూడా ఒక కారణమే. కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలందర్ని కబలించేస్తుంది. ఇది అస్థిత్వ సమస్యగా మారింది. సామ్రాజ్యవాదులు తమ లాభాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా వెనక బడిన దేశాలలో వనరులను దోచుకోవడానికి ప్రకృతిని విధ్వంసం చేయడం మూలంగానే ఈరోజు మనల్నీ కరోనా మహమ్మారి విజృంభించి ప్రజలను పట్టి పీడిస్తుంది. దీని మూలంగా లక్షలాది మరణాలే కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుక పోయి అన్ని సెక్షన్ల ప్రజలకు పనులు దొరకక, ఉద్యోగాలు లేక, జీతాలు లేక ఆకలితో అలమటిస్తూ, వైద్యం చేయించుకొని స్థితిలో మరణిస్తున్న ప్రజలు కోట్లాదిగా వున్నారు. అసలు సమస్యను ప్రక్కన పెట్టి, ప్రజల ప్రాణాలను గాలికి వదిలి, ప్రజల జీవితాలకు గ్యారంటీ ఇవ్వకుండా టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ మావోయిస్టు పార్టీని నిర్మూలించడంలో వెనకడుగు వేయడం లేదు.


ప్రజలారా !

కరోనా ఎవరిదో ఒక్కరి సమస్య కాదు. ప్రపంచ ప్రజల సమస్య, ప్రాణాంతక సమస్య, అస్థిత్వ సమస్య, ఇది సామ్రాజ్యవాదుల లాభాల కోసం వారు సృష్టించిన సమస్య, దీని అంతం కోసం ప్రజలంతా ఏకమై సామ్రాజ్యవాదులను, వీరికి ఆధారమైన భూస్వామ్యాన్ని, దళారీ నిరంకుశ పెట్టుబడి దారులను, పూర్తిగా కూల్చకుండా ప్రజలకు నిజమైన విముక్తి లేదు. దానికి నూతన ప్రజాస్వామిక విప్లవమే సరైన మార్గం.

Share it:

TELANGANA

Post A Comment: