CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ లో డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రం లో కొత్తగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రం ను ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్, ఎంపీ మాలోత్ కవిత తో కలిసి తెలంగాణ రాష్ట్ర గిరిజన అభివృద్ధి స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కేంద్రంలో కరోనా సహా 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. దీనికోసం ప్రభుత్వం ఆయా కేంద్రాల్లో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి పంపే నమూనాలను జిల్లా కేంద్రంలోని డయాగ్నొస్టిక్ సెంటర్ లో పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు మొదటి విడతలో రెండు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని అందున ఆదివాసీ గిరిజనులు ఎక్కువ ఉన్న జిల్లా ములుగు ఎంపిక చేయడం శుభసూచకమని, మరోమారు వారు మన ములుగు జిల్లా పైన ప్రేమను చాటుకున్నారని ములుగు జిల్లా ప్రజల తరఫున ఇన్చార్జి మంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హనుమంతు కె. జెండా గే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆల్లెం అప్పయ్య, ములుగు ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్, ములుగు ఎంపీపీ శ్రీదేవి సుధీర్, జడ్పిటిసి సకినాల భవానీ, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు సర్పంచులు, జిల్లా, మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: